Vinukonda: వినుకొండలో “సమాధాన్ సమారోహ్–2026” న్యాయ సదస్సు

Vinukonda: వినుకొండలో గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో “సమాధాన్ సమారోహ్–2026” న్యాయ అవగాహన సదస్సు ఘనంగా జరిగింది.

KAREEMULLA, VINUKONDA
Published on: 16 May 2026 9:18 PM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండలో “సమాధాన్ సమారోహ్–2026” న్యాయ సదస్సు

Vinukonda: గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వినుకొండ శివయ్య స్తూపం సెంటర్‌లో “సమాధాన్ సమారోహ్–2026” న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు పఠాన్ గౌస్ మొహిద్దిన్ ఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, న్యాయమూర్తి సయ్యద్ జియావుద్దీన్, వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి ఎం మహతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

న్యాయమూర్తి ఎం.మహతి మాట్లాడుతూ పిల్లలపై లైంగిక దాడులు, వేధింపులను అరికట్టేందుకు ఫోక్సో చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. పిల్లల హక్కులను హరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. న్యాయమూర్తి సయ్యద్ జియావుద్దీన్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని సూచించారు.

దేశవ్యాప్తంగా మధ్యవర్తిత్వ న్యాయంపై అవగాహన కల్పించేందుకు బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. మున్సిపల్ కమిషనర్ శివరాం ప్రసాద్, రూరల్ సీఐ బ్రహ్మయ్య, పోలీసులు, కోర్టు సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story