Vinukonda: ఎస్‌ఐఆర్ పూర్తి జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా!
Vinukonda: వినుకొండ నియోజకవర్గంలో 100% ఎన్యూమరేషన్ పూర్తి. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు ఈఆర్‌ఓ బి. నారదముని వెల్లడి.
Vinukonda: ఎస్‌ఐఆర్ పూర్తి జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా!
Vinukonda: వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ-2026 ప్రక్రియ అత్యంత పారదర్శకంగా పూర్తయిందని ఎన్నికల నమోదు అధికారి బి. నారదముని తెలిపారు. జూన్ 15 నుంచి జూలై 24 వరకు కొనసాగిన ఈ ప్రక్రియలో వినుకొండ మున్సిపాలిటీతో పాటు మొత్తం ఐదు మండలాల్లో 100 శాతం ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
క్షేత్రస్థాయి నుంచి సేకరించిన ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందన్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,66,031 మంది ఓటర్లకు గాను 2,41,959 ఎన్యూమరేషన్ ఫారాలు, అంటే 90.95 శాతం డిజిటలైజ్ చేసినట్లు తెలిపారు. డిజిటలైజ్ చేసిన వివరాలను సెల్ఫ్ మ్యాపింగ్, ప్రొజెనీ, నో మ్యాపింగ్, డెత్, పర్మినెంట్ షిఫ్టింగ్, డబుల్ ఎంట్రీ, అబ్సెంట్ తదితర కేటగిరీలుగా నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ వివరాలపై బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లతో సమావేశాలు నిర్వహించి పోలింగ్ కేంద్రాల వారీగా చర్చించినట్లు తెలిపారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్లు, ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు దాఖలు చేసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. అభ్యంతరాలపై సెప్టెంబర్ 28 వరకు సమగ్ర విచారణ జరిపి తదుపరి చర్యలు చేపడతామని నారదముని తెలిపారు.




