Vinukonda: అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి శివశక్తి ఫౌండేషన్ అండ!

Vinukonda: బొల్లాపల్లి మండలం రేమిడిచర్లలో అగ్నిప్రమాదానికి గురైన బాధిత కుటుంబానికి జీవీ ఆంజనేయులు సూచనతో శివశక్తి ఫౌండేషన్ నిత్యావసర సరుకులు అందజేసింది.

KAREEMULLA, VINUKONDA
Published on: 25 Aug 2026 3:36 PM IST
Vinukonda
X

Vinukonda: అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి శివశక్తి ఫౌండేషన్ అండ!

Vinukonda: బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామానికి చెందిన వంకరబోయిన సాంబయ్య కుటుంబానికి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ అండగా నిలిచింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో సాంబయ్యకు చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. దీంతో కుటుంబం ఒక్కసారిగా నిరాశ్రయమై,సర్వం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఈ ఘటన విషయం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు వెంటనే స్పందించి, బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించాలని ఫౌండేషన్ ప్రతినిధులను ఆదేశించారు. ఆయన సూచనల మేరకు ఫౌండేషన్ మేనేజర్ ఫణి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వంట సామగ్రి, బియ్యం బస్తా, దుస్తులు, దుప్పట్లు తదితర నిత్యావసర వస్తువులను అందజేశారు.

అగ్ని ప్రమాదంతో సర్వం కోల్పోయిన సమయంలో తమకు అండగా నిలిచి అవసరమైన సామగ్రిని అందించిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ నిర్వాహకులకు సాంబయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. బాధిత కుటుంబానికి భవిష్యత్తులోనూ అవసరమైన సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గోవింద నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షుడు షేక్ బాజీ వలి తదితరులు పాల్గొన్నారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story