Vinukonda: స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ

Vinukonda: వినుకొండలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన పల్నాడు ఎస్పీ జగదీష్ అదహళ్లి. అధికారులకు కీలక ఆదేశాలు.

KAREEMULLA, VINUKONDA
Published on: 28 Oct 2026 9:02 PM IST
Vinukonda
X

Vinukonda: స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ

వినుకొండ: పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి బుధవారం వినుకొండ పట్టణంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఇందులో భాగంగా లయోలా హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని, నిర్మల హైస్కూల్‌లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రంలో ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా అన్ని వసతులు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవసరమైన టేబుళ్లు, బ్యారికేడింగ్, ఇతర ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఎన్నికల విధులకు సంబంధించిన సామగ్రి పంపిణీ సమయంలో వర్షం కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు తరలించే సమయంలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

కౌంటింగ్ రౌండ్ల నిర్వహణ, ఎన్నికల సిబ్బంది రిసెప్షన్, ఇతర విధులకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఎన్నికల ప్రక్రియలో భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, ఎన్నికల విధులను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA