Vinukonda: వందేళ్ల భవనం.. వర్షం కురిస్తే ఫ్లెక్సీలే ఫైళ్లకు రక్షణ!

Vinukonda: వినుకొండలో వందేళ్ల నాటి తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థలో ఉంది.

KAREEMULLA, VINUKONDA
Published on: 14 Jun 2026 8:42 AM IST
Vinukonda
X

Vinukonda: వందేళ్ల భవనం.. వర్షం కురిస్తే ఫ్లెక్సీలే ఫైళ్లకు రక్షణ!

Vinukonda: వినుకొండ తహసిల్దార్ కార్యాలయ భవనం నిర్మించి దాదాపు వందేళ్లు పూర్తవడంతో పైకప్పుపై ఉన్న పెంకులు ఊడిపోయి వర్షం కురిసిన ప్రతిసారి నీరు కార్యాలయం లోపలికి కారుతోంది. దీంతో కార్యాలయంలో భద్రపరిచిన కీలకమైన ప్రభుత్వ రికార్డులు, ఫైళ్లు, కంప్యూటర్లు తడిసి దెబ్బతినే ప్రమాదం నెలకొంది.

ఈ నేపథ్యంలో శనివారం, ఆదివారం సెలవులు కావడంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. వర్షపు నీరు లోపలికి వచ్చినా నష్టం జరగకుండా, సిబ్బంది ముందు జాగ్రత్తగా ఫైళ్లు, కంప్యూటర్లపై ఫ్లెక్సీలు కప్పి భద్రపరిచారు.భవనం మరమ్మతులు లేదా నూతన భవనం నిర్మాణం అవసరమని స్థానికులు కోరుతున్నారు.

ఈ సమస్యను ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తహసిల్దార్ సురేష్ తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story