Vinukonda: చీఫ్ విప్ కార్యాలయంలో 'నిజం గెలిచింది' కార్యక్రమం

Vinukonda: వినుకొండ ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో చంద్రబాబు 53 రోజుల నిర్బంధానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా 53 కొవ్వొత్తులతో సంఘీభావ కార్యక్రమం.

KAREEMULLA, VINUKONDA
Updated on: 9 Sept 2026 10:00 PM IST
Vinukonda
X

Vinukonda: చీఫ్ విప్ కార్యాలయంలో 'నిజం గెలిచింది' కార్యక్రమం

వినుకొండ: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు, నిర్బంధం ఘటనకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వినుకొండలో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంఘీభావ కార్యక్రమం నిర్వహించారు. ‘నిజం గెలిచింది’ కార్యక్రమంలో భాగంగా వినుకొండ ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో 53 కొవ్వొత్తులు వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.

చంద్రబాబు నాయుడు జైలులో గడిపిన 53 రోజులకు సంకేతంగా 53 కొవ్వొత్తులను వెలిగించినట్లు టీడీపీ నేతలు తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సూచనల మేరకు జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కొవ్వొత్తులు వెలిగించారు.

ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ చంద్రబాబుపై అప్పటి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేసిందని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు టీడీపీ శ్రేణులు ఐక్యంగా నిలిచాయని పేర్కొన్నారు. చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున సంఘీభావం తెలిపారని గుర్తు చేశారు.

అక్రమ అరెస్టుతో చంద్రబాబు మనోధైర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించినప్పటికీ, ఆయన మరింత బలంగా ప్రజల ముందుకు వచ్చారని నేతలు అన్నారు. నిజం ఎప్పటికైనా గెలుస్తుందనే నమ్మకంతోనే ‘నిజం గెలిచింది’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం చంద్రబాబు నాయుడికి సంఘీభావంగా నినాదాలు చేశారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story