Vinukonda: వినుకొండ టిడ్కో గృహాలపై చీఫ్ విప్ సమీక్ష

Vinukonda: వినుకొండ టిడ్కో గృహ సముదాయాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సందర్శించారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 4 May 2026 3:10 PM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండ టిడ్కో గృహాలపై చీఫ్ విప్ సమీక్ష

Vinukonda: వినుకొండ టిడ్కో గృహ సముదాయాన్ని సందర్శించిన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు. వినుకొండలో పెండింగ్‌లో ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణాలను నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన జీవీ ఆంజనేయులు. రానున్న ఐదు నెలల్లో 720 టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించడమే లక్ష్యమని వెల్లడి.

సిమెంట్ రోడ్లు, తాగునీటి పైపులైన్ కనెక్షన్లు, సంపుల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశం. 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న సబ్ స్టేషన్ పనులు మరో మూడు నెలల్లో పూర్తి. గత ఎన్డీయే ప్రభుత్వ హయాంలో (2014-19) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో వినుకొండకు మొత్తం 4,096 ఇళ్లు మంజూరు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వినుకొండలో రాజకీయం చేస్తూ 2,656 ఇళ్లను రద్దు చేయడం దుర్మార్గమని విమర్శ. ప్రస్తుతం రూ. 114 కోట్ల 55 లక్షల వ్యయంతో ఇళ్ల నిర్మాణం మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరణ. నిరుపేదల కోసం ఇళ్ల సముదాయం వద్దే ప్రత్యేకంగా అంగన్‌వాడీ కేంద్రం, హెల్త్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి.

గత పాలకులు స్వార్థం కోసం పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో, కొండల దగ్గర ఇళ్ల స్థలాలు ఇచ్చి పేదలకు అన్యాయం చేశారని మండిపాటు. రానున్న ఐదు ఏళ్లలో పట్టణ, గ్రామాల్లో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వడమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం. డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుంది.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story