Vinukonda: వినుకొండలో 99.99 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి!

Vinukonda: వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ–2026 (SIR) ప్రక్రియ వేగంగా సాగుతోంది.

KAREEMULLA, VINUKONDA
Published on: 6 July 2026 7:13 AM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండలో 99.99 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి!

Vinukonda: వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ–2026 (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పారదర్శకంగా, వేగవంతంగా కొనసాగుతోందని ఎన్నికల నమోదు అధికారి బి. నారదముని తెలిపారు. నియోజకవర్గంలోని వినుకొండ మునిసిపాలిటీతో పాటు ఐదు మండలాల్లో మొత్తం 2,66,031 ఎన్యూమరేషన్ ఫారాలను 2,66,029 మంది ఓటర్లకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

క్షేత్రస్థాయిలో సేకరించిన ఫారాల డిజిటలైజేషన్ నిరంతరం కొనసాగుతోందని, ఇప్పటివరకు 1,48,138 ఫారాలు (55.68 శాతం) డిజిటలైజ్ చేసినట్లు చెప్పారు. నూజెండ్ల మండలంలో 63.90 శాతం, వినుకొండ రూరల్‌లో 58.81 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం డిజిటలైజేషన్‌కు జూలై 14, 2026 వరకు గడువు ఉందన్నారు.

మొత్తం 2,66,031 మంది ఓటర్ల వివరాల సేకరణ, సవరణ కోసం బీఎల్‌వోలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. బీఎల్‌వో కోసం వేచి ఉండకుండా ఓటర్లు స్వయంగా ఆన్‌లైన్‌లో ఎన్యూమరేషన్ ఫారం సమర్పించి తమ వివరాలను నమోదు లేదా సవరించుకోవచ్చని ఎన్నికల నమోదు అధికారి సూచించారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story