కూటమి ప్రభుత్వ సంక్షేమానికి ఆకర్షితులై ‘సైకిల్’ ఎక్కిన వైసీపీ శ్రేణులు
Vinukonda: వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం వయ్యకల్లు గ్రామంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
కూటమి ప్రభుత్వ సంక్షేమానికి ఆకర్షితులై ‘సైకిల్’ ఎక్కిన వైసీపీ శ్రేణులు
Vinukonda: వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం వయ్యకల్లు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, టీడీపీ యూనిట్ ఇంచార్జ్ వెంకట్రావు ఆధ్వర్యంలో సుమారు 25 ఎస్సీ కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా వినుకొండలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజా సంక్షేమానికి తీసుకుంటున్న నిర్ణయాలు, అలాగే వినుకొండ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల విశ్వాసం కలిగి పలువురు స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు.
పార్టీలో చేరిన కుటుంబాలు కూడా కూటమి ప్రభుత్వ పనితీరుపై నమ్మకంతో, నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో టీడీపీలో చేరినట్లు వెల్లడించాయి.




