Ponnur: ఇల్లు అద్దె నెపంతో వృద్ధుడిపై దాడి.. దొంగతనం చేసిన మహిళ అరెస్ట్!

Ponnur: పొన్నూరులో విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి కంట్లో కారం చల్లి దోపిడీకి పాల్పడిన మహిళ అరెస్ట్. 52 గ్రాముల బంగారం, నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు.

SHAREEF, PONNURU
Published on: 23 Aug 2026 5:50 PM IST
Ponnur
X

Ponnur: ఇల్లు అద్దె నెపంతో వృద్ధుడిపై దాడి.. దొంగతనం చేసిన మహిళ అరెస్ట్!

Ponnur: ఇల్లు అద్దెకు కావాలని నెపంతో ఒంటరిగా ఉంటున్న విశ్రాంత బ్యాంకు ఉద్యోగి రత్తయ్య (76) వద్దకు వెళ్లి కంట్లో కారం చల్లి వృద్ధుడిపై దాడి చేసి బీరువాలో ఉన్న 52 గ్రాముల బంగారు ఆభరణాలు, 5500 నగదు చోరీ చేసి పారిపోయిన సువర్ణ (52) అనే మహిళను ఆదివారం ఉదయం పొన్నూరు అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఆమె వద్ద నుండి బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో చోటుచేసుకుంది...

ఈనెల 21వ తేదీన పొన్నూరు పట్టణంలోని విద్యానగర్లో ఓ గృహంలో ఒంటరిగా ఉంటున్న విశ్రాంత బ్యాంకు ఉద్యోగి వద్దకు వెళ్లి ఇల్లు అద్దెకు కావాలనే నెపంతో అతనిని మాటల్లో దింపి కళ్ళల్లో కారం చల్లి గొంతు నులిమి బీరువాలో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు చోరీ చేసింది. స్థానికులు కేకలు వేయడంతో పరార్ అయింది. ఈ మహిళ పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రు గ్రామానికి చెందిన సువర్ణగా పోలీసులు గుర్తించారు.

ఈ మహిళ గతంలో విశ్రాంత ఉద్యోగి కి చెందిన పొలంలో పనిచేసినట్లు బంధువులు గుర్తించారు. తన అవసరాలకు డబ్బులు సరిపోకపోవడంతో ఎలాగోలా డబ్బులు సంపాదించాలనే తలంపుతో ఒంటరిగా ఉన్న వృద్ధుడిని టార్గెట్ చేసి దొంగతనానికి పాల్పడిందని సీఐ కిషోర్ కుమార్ తెలిపారు.

SHAREEF, PONNURU

SHAREEF, PONNURU

Next Story