Guntur: లలితా పీవీఎస్ ఆసుపత్రిలో ఉచిత స్ట్రోక్ రిస్క్ స్క్రీనింగ్!
Guntur: ప్రపంచ పక్షవాత దినోత్సవం సందర్భంగా లలితా పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో అక్టోబర్ 29 వరకు ఉచిత స్ట్రోక్ స్క్రీనింగ్ సేవలు నిర్వహిస్తున్నారు.
Guntur: లలితా పీవీఎస్ ఆసుపత్రిలో ఉచిత స్ట్రోక్ రిస్క్ స్క్రీనింగ్!
Guntur: ఈ నెల 29న నిర్వహించనున్న ప్రపంచ పక్షవాత దినోత్సవాన్ని పురస్కరించుకుని, లలితా పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో అక్టోబర్ 23 నుంచి 29వ తేదీ వరకు పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్)పై పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు లలితా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పి.వి. రాఘవ శర్మ తెలిపారు.
ఈ ఏడాది ప్రపంచ పక్షవాత దినోత్సవం సందర్భంగా వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ఇచ్చిన “ప్రతి నిమిషం విలువైనది – పక్షవాత లక్షణాలను గుర్తించండి, సకాలంలో స్పందించండి, మెదడును కాపాడండి” అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. పక్షవాతం వచ్చినప్పుడు ప్రతి నిమిషం ఎంతో కీలకమని, లక్షణాలను గుర్తించిన వెంటనే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం పొందడం ద్వారా మెదడుకు జరిగే నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత స్ట్రోక్ రిస్క్ స్క్రీనింగ్ డెస్క్‌ను ఆసుపత్రి సీఈఓ డాక్టర్ అనురాగ్ ప్రారంభించారు. ఈ డెస్క్ అక్టోబర్ 29 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇందులో భాగంగా ప్రజలకు ఉచితంగా రక్తపోటు (బీపీ), రక్తంలో చక్కెర స్థాయులు (షుగర్), బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) పరీక్షలు నిర్వహించి, రిస్క్ కార్డు ద్వారా పక్షవాతం వచ్చే ప్రమాద స్థాయిని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
అలాగే, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించేందుకు డైట్ అడ్వైస్, శారీరక కదలికలు, వ్యాయామాల ప్రాధాన్యతను తెలియజేసేందుకు ఫిజియోథెరపీ అవగాహనా సేవలను కూడా అందిస్తున్నారు. పక్షవాతం అనంతరం కోలుకోవడంలో ఫిజియోథెరపీ పాత్ర, రోగుల పునరావాసం, సమతుల్య ఆహారం, రక్తపోటు, మధుమేహ నియంత్రణ వంటి అంశాలపై సూచనలు అందిస్తున్నారు.
పక్షవాతం లక్షణాలైన ముఖం ఒకవైపుకు వాలిపోవడం, ఒక చేయి లేదా కాలు బలహీనపడటం, మాట తడబడటం వంటి సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలని ఆసుపత్రి యాజమాన్యం సూచించింది. ప్రజల్లో పక్షవాతంపై అవగాహన పెంపొందించడం, వ్యాధి ముప్పును తగ్గించేందుకు అవసరమైన జీవనశైలి మార్పులపై చైతన్యం కల్పించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమనిన్యూరాలజి ప్రొఫెసర్ డాక్టర్ U . వీరమ్మ తెలిపారు.
న్యూరాలజి ప్రొఫెసర్ డాక్టర్ U . వీరమ్మ ఈ కార్యక్రమంలో లలిత గ్రూప్ అఫ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ ఫై.వి. రాఘవశర్మ, CEO డాక్టర్ అనురాగ్, సీనియర్ న్యూరో కన్సల్ట్రన్ట్ డాక్టర్ వీరమ్మ , సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ N . శ్రీనివాసరావు , న్యూరో కన్సల్ట్రన్ట్ డాక్టర్ఉషాకిరణ్ , డాక్టర్ అనూష, ఇతర ఫార్మా D డాక్టర్స్ , నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ సిబ్బంది మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ వారం రోజులపాటు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా హీలియం బెలూన్ కార్యక్రమం, స్ట్రోక్ వాకథాన్, పారామెడికల్ సిబ్బందికి శిక్షణ, ప్రజలకు పక్షవాతంపై అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలు అక్టోబర్ 29 వరకు అందుబాటులో ఉండే ఉచిత స్క్రీనింగ్, డైట్ అడ్వైస్, ఫిజియోథెరపీ అవగాహనా సేవలను సద్వినియోగం చేసుకోవాలని లలితా పీవీఎస్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం కోరింది.




