Guntur: గుంటూరులో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ!

Guntur: ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా 'నా డిగ్రీకి విలువ ఎక్కడ?' నినాదంతో ప్రచార కార్యక్రమం ప్రారంభం.. గుంటూరులో పోస్టర్ ఆవిష్కరించిన పవన్ తేజ.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 17 Sept 2026 7:05 PM IST
Guntur
X

Guntur: గుంటూరులో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ!

Guntur: ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా జాతీయ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నా డిగ్రీ కి విలువ ఎక్కడ నా డిగ్రీ పరిస్థితి ఏమిటి? అనే నినాదంతో దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నూనె పవన్ తేజ నాయుడు అన్నారు.

గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నా డిగ్రీ కి విలువ ఎక్కడ..? కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్ తేజ మాట్లాడుతూ ఈ ప్రచార కార్యక్రమంలో కేంద్ర మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో నిరుద్యోగ యువత పై కదలిక రావాలని కోరారు.

ఈ ప్రచారం ద్వారా నిరుద్యోగ సమస్య, అలాగే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల అంశంపై దృష్టి సారించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత ప్రశ్నలు, వారి అనుభవాలను ప్రధానంగా ప్రజల ముందుకు తీసుకురావడం ఈ కార్యక్రమం లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN