Vinukonda: వినుకొండ ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు

Vinukonda: వినుకొండలో వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు. వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. కేక్ కట్ చేసి పులిహోర పంపిణీ.

KAREEMULLA, VINUKONDA
Published on: 8 July 2026 3:51 PM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండ ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు

వినుకొండ: వినుకొండ పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వైస్సార్సీపీ పీఏసీ సభ్యులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి పులిహోర పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బొల్లా మాట్లాడుతూ, రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల సంక్షేమం కోసం వైఎస్సార్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వైఎస్సార్ సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story