Guntur: గుంటూరు తూర్పులో వైఎస్సార్‌సీపీకి షాక్!

Guntur: గుంటూరు తూర్పులో వైఎస్సార్‌సీపీకి బిగ్ షాక్. భరత్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరిన వైసీపీ మాజీ కార్పొరేటర్ మర్రి అంజలి, ఆమె భర్త సత్యనారాయణ.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 28 Oct 2026 7:29 AM IST
Guntur
X

Guntur: గుంటూరు తూర్పులో వైఎస్సార్‌సీపీకి షాక్!

Guntur: గొడ్డలి పార్టీ దుకాణం మూసివేసేందుకు ఎక్కువ రోజులు లేవని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి నాయకులు వస్తున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ అన్నారు.

మంగళవారం స్థానిక తూర్పు శాసనసభ్యుల వారి కార్యాలయంలో టీడీపీ నాయకులు భరత్ రెడ్డి ఆధ్వర్యంలో రెండో డివిజన్ వైఎస్ఆర్ సీపీ మాజీ కార్పొరేటర్ మర్రి అంజలి, ఆమె భర్త వైఎస్అర్ సీపీ‌ డివిజన్ అధ్యక్షుడు మర్రి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే నసీర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీ అంటేనే అరాచకమని విమర్శించారు. గత ఐదేళ్ల వైసీపిజ పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని మండిపడ్డారు. కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంగా మార్చిన దుర్మార్గమైన పాలన వైసీపీదన్నారు.

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత పదేళ్లుగాబఅభివృద్ధి అనే మాట ఎక్కడా కనిపించలేదని అన్నారు. ప్రధాన రోడ్లను సైతం గుంతలుగా మార్చిన దయనీన దయనీయ స్థితిలో ఉందన్నారు. కుహటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలోనే 400 కోట్ల రూపాయలతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

నూతనంగా పార్టీలో చేరిన అంజలి, సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే నసీర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై తెలుగుదేశం పార్టీలో చేరామని తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN