Chirala: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి కరణం వెంకటేష్!

Chirala: బాపట్ల జిల్లా చీరాలలో డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ ఇంచార్జ్ కరణం వెంకటేష్ డిమాండ్ చేశారు.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 7 Aug 2026 9:09 AM IST
Chirala
X

Chirala: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి కరణం వెంకటేష్!

Chirala: డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని చీరాల వైసీపీ ఇంచార్జ్ కరణం వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బాపట్ల జిల్లా చీరాల వైసీపీ కార్యాలయంలో విద్యార్ధులు నిరుద్యోగ సమస్యలపై వై ఎస్ ఆర్ సీపీ ఇంచార్జీ కరణం వెంకటేష్ ఆధ్వర్యంలో రిలే నిరహార దీక్షలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని దీక్షను ప్రారంభించి రాష్ట్రవిద్యాశాఖమంత్రి నారాలోకేష్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ డి ఎస్సీ లో జరిగిన అవకతవకలలో అనేక మంది నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని దీనిపై ప్రభుత్వం సీబీఐ తో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ,నిరుద్యోగ భృతి మూడువేల వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం తక్షణమే అమలులోకి తీసుకురావాలని లేకుంటే ప్రజల పక్షాన వైసీపీ పోరాటం చేస్తుందన్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story