Repalle: సాగునీటి విడుదలకై రేపల్లెలో వైఎస్సార్‌సీపీ ధర్నా!

Repalle: రేపల్లె నియోజకవర్గంలో తీవ్ర సాగునీటి ఎద్దడి. ఇరిగేషన్ డీఈకి వినతిపత్రం అందజేసిన వైఎస్సార్‌సీపీ ఇన్చార్జి పీటా నాగమోహన్ కృష్ణ.

VIJAYA KISHORE, REPALLE
Published on: 19 Aug 2026 1:11 PM IST
Repalle
X

Repalle: సాగునీటి విడుదలకై రేపల్లెలో వైఎస్సార్‌సీపీ ధర్నా!

Repalle: రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి ఎద్దడిపై రేపల్లె నియోజకవర్గంలో ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ DE కి రైతులతో కలిసి వినతి పత్రం అందజేసిన రేపల్లె వైసిపి ఇన్చార్జి పీటా నాగమోహన్ కృష్ణ.

రేపల్లె నియోజకవర్గంలో మొత్తం 77 వేల ఎకరాలలో వరి సాగు జరగాల్సి ఉండగా, నీరు అందక కేవలం 13 వేల ఎకరాల్లో మాత్రమే సాగు ప్రారంభమైంది.మిగిలిన 63 వేల ఎకరాల్లో పంటలు/నారుమళ్లు ఎండిపోయే పరిస్థితి వచ్చింది.

ప్రభుత్వం 'క్రాప్ హాలిడే' తీసుకోమని చెప్పడం, సాగునీటితో పాటు యురియా కొరతను సృష్టించడంపై నాగమోహన్ కృష్ణ తీవ్ర ఆగ్రహం.గతంలో వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి పాలనలో రైతులకు అన్ని విధాలా సంక్షేమ పథకాలు, సాయం అందాయని గుర్తు చేసిన మోహన్ కృష్ణ.

వెంటనే సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని YSRCP తరఫున డిమాండ్.ఒకవేళ సాగునీరు విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

VIJAYA KISHORE, REPALLE

VIJAYA KISHORE, REPALLE

Next Story