Guntur: కూటమి పాలనలో పోలీసులకే రక్షణ లేదు వైఎస్సార్‌సీపీ నేతల విమర్శలు

Guntur: గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై టీడీపీ నేతల దాడిని ఖండించిన గుంటూరు తూర్పు వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 24 Aug 2026 7:12 AM IST
Guntur
X

Guntur: కూటమి పాలనలో పోలీసులకే రక్షణ లేదు వైఎస్సార్‌సీపీ నేతల విమర్శలు

Guntur: కూటమి పాలనలో పోలీసులకే రక్షణ లేదని గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ కార్పొరేటర్ మహమూద్ అన్నారు. ఆదివారం గుంటూరు తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్లు మహమూద్, అజయ్, వైఎస్ఆర్సిపి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు రాజేష్ మాట్లాడారు.

ఆర్టీసీ బస్టాండ్లో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పై టీడీపీ నేతలు దాడిని నేతలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఎవరిపై ఎక్కువ కేసులో ఉంటాయో వారికి నామినేటెడ్ పదవులు అని చెప్పిన నారా లోకేషన్ మాటలను టిడిపి నాయకులు ఆదర్శంగా తీసుకుంటున్నారని అన్నారు. పోలీసులు ఎప్పటికైనా ఏకపక్షంగా కాకుండా చట్టబద్ధంగా నడుచుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story