Autoimmune Disease: అలసటతో పాటు కీళ్ల నొప్పులున్నాయా.? మీ శరీరంలో జరుగుతోంది ఇదే
Autoimmune Disease: మన శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను చాలా సార్లు మనం పట్టించుకోము. అలసటను టెన్షన్‌గా, కడుపు ఉబ్బరాన్ని తిన్నదాని ప్రభావంగా, జాయింట్ నొప్పిని వయసు ప్రభావంగా భావించి వదిలేస్తాం.
Autoimmune Disease
Autoimmune Disease: మన శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను చాలా సార్లు మనం పట్టించుకోము. అలసటను టెన్షన్‌గా, కడుపు ఉబ్బరాన్ని తిన్నదాని ప్రభావంగా, జాయింట్ నొప్పిని వయసు ప్రభావంగా భావించి వదిలేస్తాం. కానీ ఇవన్నీ ఒక పెద్ద సమస్యకు సంకేతాలు కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గట్ హెల్త్ అంటే ఏమిటి? ఎందుకు ముఖ్యం?
గట్ అనేది కేవలం జీర్ణక్రియ కోసం మాత్రమే కాదు. ఇది మన శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. సుమారు 70% ఇమ్యూన్ కార్యకలాపాలు గట్‌లోనే జరుగుతాయి. గట్‌లో ఉండే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌ల సమతుల్యత (మైక్రోబయోమ్) మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ సమతుల్యత చెడిపోతే ఇమ్యూన్ సిస్టమ్ కూడా గందరగోళానికి గురవుతుంది.
గట్ బలహీనమైతే ఏమవుతుంది?
గట్ లోపలి పొర బలహీనమైతే దాన్ని “లీకీ గట్” అంటారు. ఈ పరిస్థితిలో హానికర పదార్థాలు రక్తంలోకి చేరతాయి.
దీంతో ఇమ్యూన్ సిస్టమ్ పదేపదే స్పందించి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ (వాపు) పెరుగుతుంది. ఇది ఎక్కువకాలం కొనసాగితే ఆటోఇమ్యూన్ వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది.
ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి?
ఆటోఇమ్యూన్ వ్యాధులు మొదట్లో పెద్దగా కనిపించవు. చిన్న చిన్న లక్షణాల రూపంలో వస్తాయి. ఎప్పుడూ అలసటగా ఉండడం, తరచూ కడుపు ఉబ్బరంగా ఉండడం, తలలో మబ్బుల్లా ఉండటం (బ్రెయిన్ ఫాగ్), తేలికపాటి కానీ పదేపదే వచ్చే జాయింట్ నొప్పి, చర్మ సమస్యలు. ఈ లక్షణాలు ఒక్కొక్కటిగా కనిపిస్తే పెద్దగా అనిపించవు. కానీ ఇవి కలిసి, ఎక్కువకాలం ఉంటే జాగ్రత్త పడాలి.
ఇమ్యూన్ సిస్టమ్ ఎలా తప్పుదోవ పడుతుంది?
కొన్ని సందర్భాల్లో “మాలిక్యులర్ మిమిక్రీ” అనే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే కొన్ని బ్యాక్టీరియా మన శరీర కణజాలంలా కనిపిస్తాయి. దీంతో ఇమ్యూన్ సిస్టమ్ గందరగోళానికి గురై, తన శరీరానికే దాడి చేస్తుంది. ఇదే ఆటోఇమ్యూన్ వ్యాధుల ప్రారంభానికి కారణమవుతుంది.
డాక్టర్లు ఏమంటున్నారు? ఎప్పుడు జాగ్రత్తపడాలి?
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆటోఇమ్యూన్ వ్యాధులు ఎప్పుడూ లక్షణాలు కనిపించే చోటే మొదలవ్వవు. చాలా సార్లు గట్ సమస్యలతో మొదలవుతాయి. అలసట, కడుపు సమస్యలు, వాపు వంటి లక్షణాలు ఒకేసారి, ఎక్కువకాలం ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ముందుగానే గుర్తిస్తే ఈ వ్యాధులను నియంత్రించడం సులభం అవుతుంది.
గమనిక: పైన పేర్కొన్న అంశాలు వైద్యుల సూచనకు ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.




