Back Pain: వెన్నునొప్పి వేధిస్తోందా? రోజువారీ చేసే ఈ పొరపాట్లే కారణం కావొచ్చు

Back Pain: ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో వెన్నునొప్పి లేదా కడుపు, నడుము నొప్పి ఒకటి.

CR Reddy
Published on: 24 Oct 2026 7:18 AM IST
Back Pain
X

Back Pain

Back Pain: ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో వెన్నునొప్పి లేదా కడుపు, నడుము నొప్పి ఒకటి. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఎముకలపై, కండరాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కేవలం వృద్ధులలోనే కాకుండా నేడు యువతలో కూడా నిరంతరం వెన్నునొప్పి సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. దీని వెనుక మన జీవనశైలి, తిండి అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి అనేక కారణాలు దాగి ఉన్నాయి. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

నిపుణులు చెబుతున్న ముఖ్యమైన కారణాలు

డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. నేటి యువతలో బ్యాక్ పెయిన్ సర్వసాధారణమైపోయింది. ఎక్కువ గంటలు ఒకేచోట కదలకుండా కూర్చోవడం, తప్పు భంగిమలో కూర్చుని గంటల తరబడి మొబైల్ ఫోన్లలో రీల్స్ చూడటం వంటి అలవాట్లు వెన్నెముకను దెబ్బతీస్తున్నాయి. అలాగే శరీరానికి అవసరమైన విటమిన్ డి లోపం, కండరాల బిగువు తగ్గిపోవడం, కిడ్నీ సమస్యలు, కీళ్ల వాతంతో పాటు ఎముకలు బలహీనపడటం వల్ల కూడా ఈ నొప్పులు తీవ్రమవుతాయి.

జీవనశైలి లోపాలు అలాగే హెవీ వర్కౌట్ల ప్రభావం

శరీరానికి సరైన పోషకాహారం అందకపోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం వంటి చెడు ఆహారపు అలవాట్లు వెన్నునొప్పిని మరింత పెంచుతాయి. మరోవైపు సరైన శిక్షణ, అవగాహన లేకుండా జిమ్‌లో భారీ బరువులు ఎత్తడం, శరీరం సామర్థ్యాన్ని మించి కసరత్తులు చేయడం వల్ల కండరాలపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఇది కాస్తా తీవ్రమైన వెన్నునొప్పికి దారితీస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల కండరాలు బలహీనపడి చిన్నపాటి బరువెక్కినా తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే నివారణ మార్గాలు

ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మన దైనందిన జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, నడకకు ప్రాధాన్యత ఇవ్వడం, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చు. ఉద్యోగం లేదా ఇతర పనుల నిమిత్తం గంటల తరబడి కూర్చునేవారు మధ్యలో కొద్దిసేపు విరామం తీసుకుని నడవాలి. మొబైల్ వాడేటప్పుడు తలను వంచకుండా సరైన భంగిమను పాటించాలి. ఒకవేళ తరచుగా తీవ్రమైన వెన్ను లేదా మెడ నొప్పి వేధిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ఉత్తమం.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.