Health Tips: చైనా సాల్ట్‌ను ఆహరంలో రుచి కోసం వేస్తున్నారా.? బీ కేర్‌ఫుల్.!
Health Tips: ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో రుచి కోసం విరివిగా వాడే చైనా సాల్ట్ (అజినోమోటో) ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల కలిగే ఆరోగ్య నష్టాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
Health Tips: చైనా సాల్ట్‌ను ఆహరంలో రుచి కోసం వేస్తున్నారా.? బీ కేర్‌ఫుల్.!
Health Tips: మన దైనందిన ఆహారంలో ఉప్పు పరిమాణం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదని వైద్యులు తరచూ చెబుతుంటారు. సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకుంటే అది ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుంది. అయితే, ప్రస్తుతం బయట లభించే ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో, హోటళ్లలో రుచిని పెంచడం కోసం విరివిగా ఉపయోగించే చైనా సాల్ట్(అజినోమోటో) సాధారణ ఉప్పు కంటే ఎంతో ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ చైనా సాల్ట్ మన శరీరంలోకి వెళ్లిన తర్వాత 'గ్లుటామిక్ యాసిడ్'ను విడుదల చేస్తుంది. దీనిని తరచూ మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతుంది. అంతేకాకుండా, ఇది మెదడు పనితీరును దెబ్బతీసే ప్రమాదానికి కూడా దారితీస్తుంది. ఈ అజినోమోటోను నిరంతరం తీసుకోవడం వల్ల ఊబకాయం, తీవ్రమైన తలనొప్పి లేదా మైగ్రేన్, అధిక రక్తపోటు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ చైనా సాల్ట్ కలిపిన ఆహార పదార్థాలకు వీలైనంత వరకు పూర్తిగా దూరంగా ఉండాలని నిపుణులు బలంగా సూచిస్తున్నారు. కాబట్టి, నాలుక రుచి కోసం ఆరోగ్యాన్ని పాడుచేసుకోకుండా బయటి ఫాస్ట్‌ఫుడ్‌ను తినడం తగ్గించడం ఎంతో ఉత్తమం.




