Egg Vs Soya: ఎగ్ వర్సస్ సోయా.. ప్రోటీన్ల కోసం ఏది బెస్ట్, ఎందులో ఎక్కువ.?

Egg Vs Soya: గుడ్డు, పనీర్, సోయా.. వీటిలో దేనిలో ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందనే దానిపై న్యూట్రిషనిస్టులు కీలక వివరాలు వెల్లడించారు.

Ravi
By Ravi
Published on: 26 Jun 2026 9:24 PM IST
Egg Vs Soya
X

Egg Vs Soya: ఎగ్ వర్సస్ సోయా.. ప్రోటీన్ల కోసం ఏది బెస్ట్, ఎందులో ఎక్కువ.?

Egg Vs Soya: శరీర నిర్మాణానికి ప్రొటీన్లు ఎంతో అవసరం. కండరాల వృద్ధికి ఇవి బాగా ఉపయోగపడతాయి. మాంసాహారం తినని వారు ప్రొటీన్ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తుంటారు. రోజువారీ ఆహారంలో గుడ్డు, సోయా చంక్స్, పనీర్ వాడకం చాలా సాధారణం. వీటిలో దేని ద్వారా ఎక్కువ ప్రొటీన్ లభిస్తుంది అనేది చాలామందికి ఉండే పెద్ద సందేహం. ఎగ్, సోయా చంక్స్, పనీర్.. వీటిలో ఏది బెస్ట్ అనేదానిపై న్యూట్రిషనిస్టులు స్పష్టత ఇచ్చారు.

న్యూట్రిషనిస్టులు చెబుతున్న వివరాల ప్రకారం ఒక గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. 50 గ్రాముల పనీర్ తీసుకుంటే అందులో 9 నుంచి 10 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. అదే 25 గ్రాముల సోయా చంక్స్‌లో ఏకంగా 13 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. దీనిని బట్టి ప్రొటీన్ కంటెంట్ పరంగా చూస్తే గుడ్డు, పనీర్ కంటే సోయా చంక్స్‌లోనే ప్రొటీన్ శాతం ఎక్కువ అని స్పష్టమవుతోంది. సోయా చంక్స్ తక్కువ బరువులో ఎక్కువ ప్రొటీన్ అందిస్తాయి కాబట్టి శాకాహారులకు ఇది అద్భుతమైన ఎంపిక.

కానీ ప్రొటీన్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం గుడ్డే మెరుగైనదని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే గుడ్డులో మన జీర్ణశక్తికి కీలకమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరం సులభంగా గ్రహించేలా చేస్తాయి. ప్రొటీన్ క్వాలిటీలో గుడ్డు తర్వాతి స్థానంలో పనీర్ ఉంటుంది. పనీర్‌లో కాల్షియం కూడా పుష్కలంగా లభిస్తుంది. మొత్తం మీద కంటెంట్ పరంగా చూస్తే సోయా ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా, క్వాలిటీ పరంగా చూస్తే మాత్రం గుడ్డు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుందని న్యూట్రిషనిస్టులు వివరిస్తున్నారు. కాబట్టి మీ అవసరాలకు తగినట్లుగా వీటిని సమతుల్యంగా ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story