Health Tips: ఉప్పు ఎక్కువగా తింటున్నారా? పొట్ట బొండంలా అయిపోతుంది జాగ్రత్త!

Health Tips: మనం తీసుకునే ఆహారంలో ఉప్పు ఎక్కువైతే ఆరోగ్యానికి ముప్పని నిపుణులు చెబుతున్నారు. బరువు పెరగడం, బీపీ, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.

Ravi
By Ravi
Published on: 18 Aug 2026 7:52 PM IST
Health Tips
X

Health Tips: ఉప్పు ఎక్కువగా తింటున్నారా? పొట్ట బొండంలా అయిపోతుంది జాగ్రత్త!

Health Tips: మనం రోజూ తీసుకునే ఆహారంలో ఉప్పు మోతాదు ఎక్కువైతే అది అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి తగిన మోతాదులో ఉప్పు అవసరమే అయినప్పటికీ, అది హద్దు మీరితే మాత్రం తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందుగా బరువు పెరగడం, ఎల్లప్పుడూ తీవ్రమైన దాహం వేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు వెల్లడించారు.

ఈ అలవాటును దీర్ఘకాలం పాటు కొనసాగిస్తే ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా హైపర్ టెన్షన్ లేదా బీపీ సమస్య పెరుగుతుంది. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుంది. అలాగే కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తడంతో పాటు ఎముకలు బలహీనంగా మారుతాయని హెచ్చరిస్తున్నారు. శరీరంలో సోడియం స్థాయిలు పెరగడం వల్ల ఇలాంటి అనారోగ్య ముప్పులు కలుగుతాయి.

ఈ సమస్యలను అదుపులో ఉంచుకోవడానికి ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంట్లో తయారైన తాజా పదార్థాలను మాత్రమే ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం. ఉప్పు వాడకాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు తాజా కూరగాయలు, పండ్లను రోజూ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చిన్నపాటి ఆహారపు అలవాట్ల మార్పుల ద్వారా పెద్ద అనారోగ్యాల నుంచి సులభంగా రక్షణ పొందవచ్చు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.