Health Tips: జుట్టు ఎక్కువగా రాలుతోందా? అయితే అదే కారణం కావచ్చు.!
Health Tips: జుట్టు ఎక్కువగా రాలడానికి శరీరంలో కొన్ని ముఖ్యమైన పోషకాలు లోపించడం కూడా కారణం కావొచ్చని న్యూట్రిషనిస్ట్ లవ్నీత్ బాత్రా చెప్పారు.
Health Tips: జుట్టు ఎక్కువగా రాలుతోందా? అయితే అదే కారణం కావచ్చు.!
Health Tips: జుట్టు ఎక్కువగా రాలడానికి శరీరంలో కొన్ని ముఖ్యమైన పోషకాలు లోపించడం కూడా కారణం కావొచ్చని న్యూట్రిషనిస్ట్ లవ్నీత్ బాత్రా చెప్పారు.
ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో జుట్టు రాలడం ఒకటి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ జుట్టు రాలే సమస్యతో సతమతమవుతున్నారు. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉండవచ్చని అందరూ భావిస్తుంటారు. అయితే శరీరంలో కొన్ని ముఖ్యమైన పోషకాలు లోపించడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లవ్నీత్ బాత్రా ఈ విషయంపై స్పష్టమైన వివరాలు అందించారు.
శరీరంలో ఫెరిటిన్, ప్రొటీన్, జింక్ అలాగే కాపర్ వంటి కీలకమైన పోషకాలు లోపిస్తే హెయిర్ ఫాల్ సమస్య పెరుగుతుందని ఆమె తెలిపారు. మన శరీరంలో గుండె వంటి ముఖ్యమైన అవయవాలను రక్షించడానికి ముందు ప్రాధాన్యత ఇస్తారు. ఆ సమయంలో శరీరం తలకు అందవలసిన పోషకాల సరఫరాను తాత్కాలికంగా నిలిపేస్తుంది. దీనివల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడి రాలిపోవడం ప్రారంభిస్తాయని ఆమె వివరించారు.
ఫెరిటిన్ అనేది మన కణాలలో ఐరన్‌ను నిల్వ చేసి, అవసరమైనప్పుడు విడుదల చేసే ఒక ముఖ్యమైన బ్లడ్ ప్రొటీన్. శరీరంలో దీని స్థాయిలు తగ్గినప్పుడు జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే ప్రొటీన్, జింక్, కాపర్ వంటి ఖనిజాలు కూడా జుట్టు ఎదుగుదలకు ఎంతో అవసరం. వీటిలో ఏ ఒక్కటి తగ్గినా జుట్టు రాలే సమస్య మొదలవుతుంది. సరైన ఆహారపు అలవాట్లతో ఈ పోషకాల లోపాన్ని సరిచేసుకోవచ్చు.
రోజూ తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు ఉండేలా చూసుకోవడం మంచిది. పోషకాహార లోపం వల్ల కేవలం జుట్టు మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు తగిన పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు.




