చికెన్‌లో ఆ పార్ట్ పోషకాల పవర్ హౌస్.. బెనిఫిట్స్ తెలిస్తే వదలరంతే..!

Chicken Feet Health Benefits: మనం సాధారణంగా చికెన్ షాపుకు వెళ్లినప్పుడు మాంసం, లెగ్ పీసుల మీద చూపే శ్రద్ధ కోడి కాళ్ల మీద చూపం.

Venkat
Updated on: 13 May 2026 12:18 PM IST
Chicken Feet Health Benefits
X

చికెన్‌లో ఆ పార్ట్ పోషకాల పవర్ హౌస్.. బెనిఫిట్స్ తెలిస్తే వదలరంతే..!

Chicken Feet Health Benefits: మన దగ్గర తక్కువగా చూసే కోడి కాళ్లకు చైనా, వియత్నాం, మెక్సికో వంటి దేశాల్లో చికెన్ మాంసం కంటే ఎక్కువ ధర ఉంటుంది. సింగపూర్‌లో కిలో కోడి కాళ్ల ధర సుమారు 277 రూపాయల వరకు పలుకుతోంది. అమెరికా వంటి దేశాలు ఏటా లక్షల టన్నుల కోడి కాళ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాయంటేనే వీటి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.

పోషకాల గని: కొల్లాజెన్ ప్రత్యేకం..

కోడి కాళ్లలో ఉండే మొత్తం ప్రోటీన్‌లో దాదాపు 70 శాతం 'కొల్లాజెన్' ఉంటుంది. ఇది మన శరీరానికి అత్యంత అవసరమైన ప్రోటీన్. వయసు పెరిగే కొద్దీ శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గి చర్మం ముడతలు పడటం, ఎముకలు బలహీనపడటం జరుగుతుంది. కోడి కాళ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల చర్మం నిగారింపు పెరగడమే కాకుండా, కీళ్ల నొప్పులు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. వీటిలో కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ ఏ మరియు ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఆరోగ్య ప్రయోజనాలు..

చర్మ ఆరోగ్యం: కొల్లాజెన్ వల్ల చర్మం ముడతలు పడకుండా, తేమతో ఆరోగ్యంగా ఉంటుంది.

కీళ్ల దృఢత్వం: ఎముకలు, కండరాలను కలిపి ఉంచే స్నాయువుల బలానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

జుట్టు పెరుగుదల: ఇందులోని ఖనిజాలు జుట్టు, గోళ్ల పెరుగుదలకు తోడ్పడతాయి.

పిండం అభివృద్ధి: గర్భిణీలు పరిమితంగా తీసుకోవడం వల్ల ఫోలేట్ లభించి పిండం ఎదుగుదలకు సహాయపడుతుంది.

ఎలా వండుకోవాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

కోడి కాళ్లను నేరుగా వేయించి తినడం కంటే సూప్ లేదా గ్రేవీ రూపంలో తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. వేయించినప్పుడు అందులో సంతృప్త కొవ్వులు పెరిగి గుండెకు ప్రమాదకరం కావచ్చు.

గమనిక: కోడి కాళ్లపై మట్టి, బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉన్నందున, పై చర్మాన్ని పూర్తిగా తొలగించి, వేడి నీటితో శుభ్రంగా కడిగి, సరైన ఉష్ణోగ్రత వద్ద ఉడికించాలి. సరిగ్గా ఉడకని పక్షంలో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

ఎవరు తినవచ్చు?

సాధారణంగా ఎవరైనా వారానికి 100 నుంచి 150 గ్రాముల వరకు తీసుకోవచ్చు. అయితే పళ్లు లేని వృద్ధులకు, చిన్న పిల్లలకు ఇచ్చేటప్పుడు గొంతులో ఇరుక్కునే ప్రమాదం ఉన్నందున జాగ్రత్త వహించాలి.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story