Health Tips: తిన్న వెంటనే ఈ తప్పులు అస్సలు చేయకండి.. అవేంటంటే?

Health Tips: అన్నం తిన్న వెంటనే పడుకుంటున్నారా? లేదా టీ, కాఫీలు లాంటివి తాగుతున్నారా.? అయితే మీరు మీ ఆరోగ్యంతో ఆడుకుంటున్నట్లే.

Ravi
By Ravi
Published on: 16 Jun 2026 6:05 PM IST
Health Tips
X

Health Tips: తిన్న వెంటనే ఈ తప్పులు అస్సలు చేయకండి.. అవేంటంటే?

Health Tips: మంచి పోషకాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, భోజనం చేసిన తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటించడం కూడా ఆరోగ్యానికి అంతే ముఖ్యం. కడుపునిండా తిన్న వెంటనే కొన్ని పనులు చేయడం వల్ల జీర్ణవ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భోజనం తర్వాత అస్సలు చేయకూడని తప్పులివే:

వెంటనే పడుకోవడం:

కడుపునిండా తిన్న వెంటనే మంచం ఎక్కి నిద్రపోవడం చాలామందికి ఉన్న చెడు అలవాటు. కానీ ఇలా చేయడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట లాంటి ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి.

టీ లేదా కాఫీ తాగడం:

భోజనం పూర్తయిన వెంటనే టీ లేదా కాఫీ తాగితే, అది మన శరీరం తీసుకున్న ఆహారంలోని ఐరన్‌ను గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అలాగే కడుపులో అసిడిటీని కూడా విపరీతంగా పెంచుతుంది.

పండ్లు తినడం:

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, భోజనం చేసిన వెంటనే వాటిని తినకూడదు. అలా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

స్నానం చేయడం:

తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల రక్తప్రసరణ జీర్ణాశయం నుంచి చర్మం వైపు మళ్లుతుంది. దీనివల్ల జీర్ణక్రియ ప్రక్రియ బాగా ఆలస్యమవుతుంది. భోజనానికి ముందే స్నానం చేయడం ఉత్తమం.

సిగరెట్ తాగడం:

భోజనం తర్వాత ధూమపానం చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇది జీర్ణక్రియను బాగా నెమ్మదించేలా చేస్తుంది. తద్వారా ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యే సామర్థ్యం బాగా తగ్గిపోతుంది.

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం భోజనం చేసిన తర్వాత కనీసం అరగంట నుంచి గంట వరకు పైన పేర్కొన్న పనులకు దూరంగా ఉండటం ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story