ఆఫీసులో ఈ స్నాక్స్ తిన్నారంటే.. అసలు అలసట ఉండదిక.!

healthy office snacks: ఆఫీసులో గంటల తరబడి పనిచేస్తున్నప్పుడు ఆకలి, అలసటగా అనిపిస్తుందా? అయితే మీ ఎనర్జీ లెవల్స్ తక్షణమే పెంచేందుకు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న బెస్ట్ స్నాక్స్ ఏంటో తెలుసుకోండి.

Ravi
By Ravi
Published on: 30 Jun 2026 8:06 AM IST
healthy office snacks
X

ఆఫీసులో ఈ స్నాక్స్ తిన్నారంటే.. అసలు అలసట ఉండదిక.!

healthy office snacks: ఆఫీసులో గంటల తరబడి ఒకే చోట కూర్చుని కదలకుండా పని చేయడం వల్ల చాలామందికి తరచుగా ఆకలి వేయడంతో పాటు తీవ్రమైన అలసటగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఏదైనా తినాలనిపించి చాలామంది బిస్కెట్లు, చిప్స్ లాంటి 'ప్రాసెస్డ్ ఫుడ్స్' తింటుంటారు. కానీ వీటికి బదులుగా ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు.

ఆఫీసులో అలసటను తీసేసి తక్షణ శక్తిని ఇచ్చేందుకు బాదం, వాల్‌నట్స్, పల్లీలు, డ్రైఫ్రూట్ చిక్కీలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు, ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి తినడం వల్ల త్వరగా ఆకలి వేయకుండా కడుపు నిండిన భావన కలగడమే కాకుండా, శరీరంలో శక్తి ఎక్కువసేపు నిలిచి ఉండేలా చేస్తాయి.

వీటితో పాటు పని ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరంలో ఎనర్జీ లెవల్స్ పడిపోకుండా ఉండాలంటే ద్రవాహారం కూడా చాలా ముఖ్యం. కూల్‌డ్రింక్స్‌ లేదా ఎక్కువసార్లు కాఫీ, టీలకు బదులుగా కొబ్బరి నీళ్లు లేదా మజ్జిగ తాగడం ఉత్తమమైన ఎంపిక. ఇవి శరీరానికి అవసరమైన ద్రవాలను, ఎలక్ట్రోలైట్లను తక్షణమే అందించి మెదడును, శరీరాన్ని పూర్తిగా రిఫ్రెష్ చేస్తాయి.

ఆఫీసులో రోజంతా చురుకుగా, ఉత్సాహంగా పనిచేయడానికి రోజువారీ అలవాట్లలో ఈ చిన్నపాటి ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story