Health Tips: రోజూ ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఫుడ్ వేడి చేసి తింటున్నారా.. ఏరికోరి రోగాలు కొనితెచ్చుకున్నట్టే!
Health Tips: మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు వేడి చేసుకుని తింటున్నారా. మీరు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Health Tips: రోజూ ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఫుడ్ వేడి చేసి తింటున్నారా.. ఏరికోరి రోగాలు కొనితెచ్చుకున్నట్టే!
Health Tips: ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది సమయం లేక వండిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని, మళ్లీ కావాల్సినప్పుడు వేడి చేసుకుని తింటుంటారు. కానీ, ఇలా చేయడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని, కొన్ని రకాల పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టి మళ్లీ వేడి చేస్తే అవి విషంగా మారే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫ్రిజ్‌లో పెట్టి వేడి చేయకూడని పదార్థాలివే:
నాన్-వెజ్: వండిన మాంసాహారాన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేసి, తర్వాత వేడి చేసి తినడం చాలా ప్రమాదకరమని డాక్టర్లు చెబుతున్నారు.
కూరగాయలు, ఇతర పదార్థాలు: కేవలం మాంసాహారం మాత్రమే కాకుండా.. మనం తరచుగా తినే అన్నం, బంగాళదుంపలు, గుడ్లు, పుట్టగొడుగులు, పాలకూర లాంటి వాటిని కూడా ఫ్రిజ్‌లో ఉంచి మళ్లీ వేడి చేయకూడదని పేర్కొన్నారు.
ఎందుకు వేడి చేయకూడదు?
ఆయా పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచి మళ్లీ వేడి చేసినప్పుడు వాటిలో హానికరమైన బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతుంది. వీటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతిని, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పాత ఆహారానికి దూరంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఏ పూటకు ఆ పూట తాజాగా వండుకుని తినడమే మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.




