Biryani: బిర్యానీ తిన్నా లావు పెరగకూడదంటే.? ఇదిగో సూచనలు..

Biryani: చికెన్ బిర్యానీ అంటే ఇష్టపడని వారుండరు. కానీ, బిర్యానీ ఎక్కువగా తింటే బరువు పెరుగుతామనే భయంతో చాలామంది దూరంగా ఉంటారు. అయితే, బిర్యానీ తిన్నా లావు కాకుండా ఉండటానికి డాక్టర్ విక్రాంత్ సింగ్ చెబుతున్న అద్భుతమైన చిట్కా ఏంటో ఇక్కడ తెలుసుకోండి.

Ravi
By Ravi
Published on: 2 July 2026 9:00 PM IST
Biryani
X

Biryani: బిర్యానీ తిన్నా లావు పెరగకూడదంటే.? ఇదిగో సూచనలు..

Biryani: చికెన్ బిర్యానీ అనగానే భోజనప్రియులకు నోరూరుతుంది. కానీ, బిర్యానీ ఎక్కువగా తింటే బరువు పెరుగుతామేమో అన్న భయంతో చాలామంది తమ కోరికను చంపుకుంటారు. అయితే, సరైన పద్ధతిలో చికెన్ బిర్యానీ తింటే శరీరానికి మంచిదని డాక్టర్ విక్రాంత్ సింగ్ సూచిస్తున్నారు.

బిర్యానీ తిన్నా బరువు పెరగకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలని ఆయన చెబుతున్నారు:

ప్రొటీన్ ఫస్ట్: ముందుగా బిర్యానీలోని చికెన్ ముక్కలను మాత్రమే తినాలని, ఆ తర్వాతే రైస్‌ను తినాలని ఆయన చెప్పారు.

చక్కెర స్థాయిల నియంత్రణ: ఇలా 'ప్రొటీన్ ఫస్ట్' పద్ధతిని పాటిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు ఒకేసారి పెరగవని, ఇది బరువు పెరగకుండా ఉండటానికి సహాయపడుతుందని ఆయన వివరించారు.

ఇంట్లో చేసుకుంటేనే మేలు: బయట రెస్టారెంట్లలో కంటే ఇంట్లోనే చికెన్ బిర్యానీ చేసుకొని తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆయన పేర్కొన్నారు. ఈ చిన్న మార్పు చేయడం ద్వారా బిర్యానీని ఆస్వాదిస్తూనే బరువును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story