Mental Health: సమస్యలెన్ని ఉన్నా మగాడివే.. ఒక్క నవ్వు వెనుక దాచుకోకు.!
Mental Health: మానసిక సమస్యలు అనేవి కేవలం మహిళలకే కాదు పురుషులకూ వస్తుంటాయి. అయితే, సమాజం ఏమనుకుంటుందో అనే భయంతో మగవాళ్లు తమ బాధలను దాచుకుంటారు.
Mental Health: సమస్యలెన్ని ఉన్నా మగాడివే.. ఒక్క నవ్వు వెనుక దాచుకోకు.!
Mental Health: సాధారణంగా సమాజంలో మానసిక సమస్యలు, ఒత్తిడి అనగానే ఎక్కువ శాతం మహిళల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ, పురుషులు కూడా తీవ్రమైన మానసిక సమస్యలను ఎదుర్కొంటారనేది పచ్చి నిజం. అయితే "మగవాళ్లు ఏడవకూడదు, ధైర్యంగా ఉండాలి" అనే సామాజిక అంచనాలు, అలాగే ఎదుటివారు ఏమనుకుంటారో అనే భయం వల్ల చాలామంది పురుషులు తమ మనసులోని బాధలను ఎవరికీ చెప్పుకోలేరు. ఆ నిశ్శబ్దాన్ని లోపలే దాచుకొని మానసికంగా నలిగిపోతుంటారు.
పురుషుల్లో దాగి ఉండే ఈ మానసిక ఒత్తిడి తీవ్రమైనప్పుడు వారి ప్రవర్తన, ఆరోగ్యంలో పలు మార్పులు వస్తాయని ప్రముఖ సైకియాట్రిస్ట్ రాహుల్ తెలిపారు. మానసిక సమస్యలు పెరిగినప్పుడు పురుషులలో కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే:
తీవ్రమైన కోపం, చిరాకు: చిన్న చిన్న విషయాలకే విపరీతంగా కోప్పడటం లేదా ఎప్పుడూ చిరాగ్గా ఉండటం.
మత్తుకు బానిసవడం: మానసిక పెయిన్ నుంచి తప్పించుకోవడానికి కొందరు మద్యపానం, ధూమపానం లేదా ఇతర మత్తు పదార్థాలకు బానిసవుతారు.
శారీరక ఇబ్బందులు: నిరంతర ఒత్తిడి వల్ల తరచూ తలనొప్పి రావడం, శరీరం తీవ్రమైన అలసటకు గురికావడం.
మగవాళ్లు తమ మానసిక సమస్యలను దాచుకోవడం వల్ల పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని డాక్టర్ రాహుల్ హెచ్చరిస్తున్నారు. సమస్యలు తీవ్ర స్థాయికి చేరకముందే పురుషులు తమ మనసులోని ఫీలింగ్స్‌ను, బాధలను ఫ్యామిలీ మెంబర్స్‌తో లేదా నమ్మకమైన ఫ్రెండ్స్‌తో పంచుకోవాలని ఆయన సూచించారు.
మనసు విప్పి మాట్లాడి, ఆ నిశ్శబ్దాన్ని వీడితేనే మెంటల్ హెల్త్ మెరుగవుతుందని, అవసరమైతే సంకోచం లేకుండా ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ లేదా థెరపీ తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. మగవాడిగా పుట్టినంత మాత్రాన బాధలను దాచుకోవాల్సిన అవసరం లేదని, మనస్సు విప్పి మాట్లాడటమే ఆరోగ్యానికి మార్గమని గుర్తించాలి.




