Health Tips: స్నానం తర్వాత ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేదంటే!
Health Tips: స్నానం చేసిన తర్వాత మీరు చేసే కొన్ని చిన్న పొరపాట్లు మీ చర్మం, జుట్టుపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Health Tips: స్నానం తర్వాత ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేదంటే!
Health Tips: స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రపడటమే కాకుండా, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. కానీ, స్నానం చేసిన తర్వాత చాలామందికి తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఈ చిన్న పొరపాట్లు మీ అందమైన చర్మాన్ని, జుట్టును పాడు చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్నానం తర్వాత మనం చేయకూడని ఆ ముఖ్యమైన తప్పులు ఏంటో ఇక్కడ చూద్దాం.
స్నానం తర్వాత చేయకూడని పొరపాట్లు ఇవే:
టవల్‌తో గట్టిగా రుద్దకండి:
ముఖాన్ని కడుక్కున్న తర్వాత లేదా స్నానం చేశాక టవల్‌తో గట్టిగా రుద్ది తుడుచుకోవడం చాలామందికి అలవాటు. ఇలా ముఖాన్ని టవల్‌తో గట్టిగా రుద్దడం వల్ల చర్మంపై ముడతలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చర్మాన్ని ఎప్పుడూ మృదువైన టవల్‌తో సున్నితంగా అద్దుతూ మాత్రమే తుడుచుకోవాలి.
వెంటనే క్రీమ్స్ రాయొద్దు:
వేడి నీటితో స్నానం చేసిన తర్వాత మన చర్మం చాలా సెన్సిటివ్‌గా మారుతుంది. ఆ సమయంలో వెంటనే లోషన్లు లేదా క్రీమ్స్ రాయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కాస్త సమయం ఇచ్చి, చర్మం సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చాకే మాయిశ్చరైజర్లు వాడటం మంచిది.
తడి జుట్టుతో జాగ్రత్త:
స్నానం చేసిన తర్వాత తడి జుట్టు చాలా సున్నితంగా ఉండి, త్వరగా ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి స్నానం చేసిన వెంటనే తడి జుట్టును గట్టిగా దువ్వకూడదు. అలాగే తడి తలతో ఎప్పుడూ నిద్రపోకూడదు. దీనివల్ల జుట్టు రాలడంతో పాటు ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
బిగుతైన దుస్తులు వద్దు:
స్నానం చేసిన వెంటనే చర్మం స్వేచ్ఛగా గాలి పీల్చుకునేలా ఉండాలి. అందుకే స్నానం పూర్తయిన వెంటనే చాలా బిగుతుగా ఉండే బట్టలు వేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. కాస్త వదులుగా, సౌకర్యవంతంగా ఉండే దుస్తులు ధరించడం ఉత్తమం.




