Health: మటన్‌లోని ఈ భాగం తిన్నారో ఇక మీరు అంతే.! షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవిగో..

Health: మటన్‌లో రిబ్స్, బెల్లీ, బ్రెస్ట్, తోకకు దగ్గరగా ఉండే భాగాల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది.

Ravi
By Ravi
Published on: 23 Aug 2026 1:56 PM IST
Health
X

Health: మటన్‌లోని ఈ భాగం తిన్నారో ఇక మీరు అంతే.! షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవిగో..

Health: మటన్‌లో రిబ్స్, బెల్లీ, బ్రెస్ట్, తోకకు దగ్గరగా ఉండే భాగాల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మటన్‌ను తరచూ తింటే బరువు పెరగడం, ఒబేసిటీ తదితర సమస్యలొస్తాయి.

మాంసాహార ప్రియులు ఇష్టంగా తినే మటన్ ఆరోగ్యానికి చేసే మేలు కంటే దానిలో ఉండే కొవ్వు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై వైద్య నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మటన్‌లో కొన్ని నిర్దిష్టమైన భాగాలలో ఫ్యాట్ శాతం అత్యంత ఎక్కువగా ఉంటుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

ముఖ్యంగా రిబ్స్, బెల్లీ, బ్రెస్ట్ అలాగే తోకకు దగ్గరగా ఉండే భాగాలలో కొవ్వు అధికంగా నిల్వ ఉంటుందని వెల్లడించారు. ఈ రకమైన కొవ్వు పదార్ధాలు అధికంగా ఉండే మాంసాన్ని తరచూ తీసుకోవడం ద్వారా శరీరంలో అనవసరమైన కొవ్వు పెరిగి అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ రకమైన కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే మటన్‌ను తరచూ తినడం వల్ల శరీర బరువు వేగంగా పెరగడంతో పాటు ఒబేసిటీ సమస్య తలెత్తుతుంది. అంతేకాకుండా రక్తంలో ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు అసాధారణంగా పెరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల భవిష్యత్తులో గుండె ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే ఆహారపు అలవాట్లలో తగిన జాగ్రత్తలు పాటించడం ఎంతైనా అవసరమని సూచిస్తున్నారు.

అధిక నూనె, ఉప్పు అలాగే ఎక్కువ మసాలాలు జోడించి తయారు చేసే మటన్ వంటకాలను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీనివల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం అలాగే గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తరచూ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మాంసాహారాన్ని ఇష్టపడేవారు ఆరోగ్య రీత్యా తగిన జాగ్రత్తలు పాటిస్తూ, కొవ్వు తక్కువగా ఉండే భాగాలను ఎంచుకోవడం ఉత్తమం. సమతుల్య ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా రక్షణ పొందవచ్చు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story