Health Tips: ప్రతీ ముగ్గురికి ఓ మహిళకు ఒబేసిటీ.! ఇలా ఈజీగా బయటపడండి..

Health Tips: దేశంలో ఊబకాయం సమస్య మహమ్మారిలా విస్తరిస్తోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం దేశంలోని ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నారని నివేదిక స్పష్టం చేస్తుండగా, ఈ ప్రమాదకరమైన ఒబేసిటీ వల్ల వచ్చే జబ్బులు ఏంటి, దీని నుంచి ఎలా బయటపడాలో వైద్యులు సూచిస్తున్నారు.

Ravi
By Ravi
Published on: 1 July 2026 5:32 PM IST
Health Tips
X

Health Tips: ప్రతీ ముగ్గురికి ఓ మహిళకు ఒబేసిటీ.! ఇలా ఈజీగా బయటపడండి..

Health Tips: దేశంలో ఊబకాయం రోజురోజుకూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మహిళల ఆరోగ్యంపై నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS) పలు ఆశ్చర్యకర విషయాలను వెల్లడించింది. దేశంలో 15-49 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు ఒబేసిటీ లేదా అధిక బరువుతో బాధపడుతున్నారని ఈ సర్వే తెలిపింది.

2019-21 సంవత్సరాల మధ్య కాలంలో ఇది 24శాతంగా ఉండగా, 2023-24 నాటికి ఇది ఏకంగా 30.7 శాతానికి పెరిగిందని సర్వే పేర్కొంది. ఇక పురుషుల విషయానికి వస్తే, 27.3 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారని, 2019-21తో పోలిస్తే మగవారిలో ఈ సమస్య 4.4 శాతం పెరిగిందని వివరించింది.

ఈ స్థాయిలో ఒబేసిటీ లేదా అధిక బరువు పెరగడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీనివల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు, హైబీపీ, ఫ్యాటీ లివర్, ఇన్ఫెర్టిలిటీ సమస్యలు వస్తాయని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా, పలు రకాల క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఊబకాయం సమస్యను తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండటానికి వైద్యులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు.

- ఆహారంలో ఎల్లప్పుడూ ప్రోటీన్ అధికంగా ఉండే ఫుడ్ తీసుకోవాలి.

- తాజా పండ్లు, మిల్లెట్స్‌ను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

- ఆరోగ్యానికి హాని చేసే ప్రాసెస్డ్ ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి.

- బరువును అదుపులో ఉంచుకోవడానికి క్రమం తప్పని వ్యాయామం చాలా అవసరం.

- ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటల పాటు కంటినిండా నిద్రపోవాలి.

- మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవడం ద్వారా కూడా ఈ ఒబేసిటీ సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story