Health Tips: జిమ్ వద్దు బాబోయ్.! తిన్న వెంటనే నడవడం మేలు.. ఇదిగో వివరాలు..

Health Tips: ఫిట్‌నెస్ కోసం రోజూ జిమ్‌లో గంటల తరబడి చెమటోడ్చే కంటే.. భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Ravi
By Ravi
Published on: 2 July 2026 6:52 PM IST
Health Tips
X

Health Tips: జిమ్ వద్దు బాబోయ్.! తిన్న వెంటనే నడవడం మేలు.. ఇదిగో వివరాలు..

Health Tips: ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ కోసం చాలామంది జిమ్‌లకు వెళ్లి కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు. అయితే, జిమ్‌లో ఎక్కువ సమయం కేటాయించి కష్టపడే కంటే.. ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

వైద్యులు చెబుతున్న ముఖ్యమైన ప్రయోజనాలు ఇవే:

జిమ్ కంటే మేలు: జిమ్‌లో 45 నిమిషాల పాటు కఠినమైన వర్కౌట్స్ చేయడం కంటే, ప్రతిరోజూ భోజనం తర్వాత కనీసం 15 నిమిషాలు నడవడం వల్ల శరీరానికి ఎన్నో రెట్ల ప్రయోజనాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు.

షుగర్ కంట్రోల్: భోజనం చేసిన వెంటనే నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఏకంగా 20-30 శాతం వరకు తగ్గుతాయి. అలాగే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సామర్థ్యం కూడా గణనీయంగా మెరుగుపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

స్థూలకాయానికి చెక్: నేటి కాలంలో ఎక్కువ మందిని వేధిస్తున్న స్థూలకాయం, మధుమేహం వంటి తీవ్రమైన సమస్యలను అరికట్టడానికి తిన్న తర్వాత నడవడం అనేది అత్యంత సులభమైన, ప్రభావవంతమైన మార్గమని చెబుతున్నారు.

మెరుగైన జీవక్రియ: భోజనం తర్వాత క్రమం తప్పకుండా నడిస్తే శరీరంలో జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. దీనివల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమై కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ వ్యాధిగ్రస్తులు భారీ వ్యాయామాలు చేయలేకపోయినా.. కనీసం తిన్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు నడకను తమ దినచర్యలో భాగంగా చేసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story