Annadata Sukhibhava: నేడే ఖాతాల్లోకి రూ.7,000.. పండుగ చేసుకుంటున్న రైతులు.!
Annadata Sukhibhava: ఏపీలో అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ కింద నేడే రైతుల ఖాతాల్లో రూ.7,000 జమ కానున్నాయి.
Annadata Sukhibhava: నేడే ఖాతాల్లోకి రూ.7,000.. పండుగ చేసుకుంటున్న రైతులు.!
AP farmers : ఏపీలోని అన్నదాతలకు అదిరిపోయే వీకెండ్ గిఫ్ట్ అందింది. నైరుతి రుతుపవనాల రాకతో పొలం బాట పట్టిన రైతులకు పెట్టుబడి కష్టాలు తీరుస్తూ కూటమి ప్రభుత్వం శనివారం భారీ ఊరటనిచ్చింది. సూపర్ సిక్స్ హామీల్లో అత్యంత కీలకమైన ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకం కింద ఒకేసారి రూ.7,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల రైతు కుటుంబాల అకౌంట్లలోకి ఏకంగా రూ.3,125 కోట్లను ప్రభుత్వం నేరుగా బటన్ నొక్కి విడుదల చేయనుంది.
రైతులకు పెట్టుబడి భారం తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ నిధులను అందిస్తున్నాయి. ఈ రోజు రైతుల ఖాతాల్లో పడే రూ.7 వేల వివరాలు ఇవే...రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. 5,000 ,కేంద్ర ప్రభుత్వ వాటా రూ. 2,000,మొత్తం ఒకేసారి చేతికి అందేది మొత్తం రూ. 7,000.
పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ నుంచి పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనుండగా.. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుంట్ల నుంచి ఈ నిధులను విడుదల చేయనున్నారు. అనంతరం ఆయన రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సాధకబాధకాలను తెలుసుకోనున్నారు.
అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20,000 చొప్పున ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందిస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 భరిస్తుండగా, కేంద్రం పీఎం కిసాన్ కింద రూ.6,000 ఇస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కూడా మూడు విడతల్లో మొత్తం రూ.8,985 కోట్లను ప్రభుత్వం విజయవంతంగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేసింది.
ఎవరెవరికి లబ్ధి?
భూ యజమానులైన రైతులు సంఖ్య 45.69 లక్షల మంది. అటవి భూముల సాగుదారులు 1.16 లక్షల మంది.ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునే రైతులు ఈ క్రింది అర్హతలను,రికార్డులను సరిచూసుకోవాలని ప్రభుత్వం సూచించింది.పీఎం కిసాన్ పోర్టల్‌లో పేరు నమోదై ఉండాలి.తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. స్పష్టమైన భూమి రికార్డులు కలిగి ఉండాలి. బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి. మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలి . పట్టాదారు పాసు పుస్తకంలో ఉన్న పేరు, ఆధార్‌లోని పేరు కరెక్ట్‌గా మ్యాచ్ అవ్వాలి.
సరిగ్గా అదను చూసి, సాగు పనులు మొదలయ్యే సమయానికే పెట్టుబడి సాయం అందుతుండటంతో చిన్న, సన్నకారు రైతుల ఆనందానికి అవధులు లేవు. "అన్నదాత సుఖీభవ" అంటూ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో ఏపీ పల్లెల్లో ఇవాళ పండుగ వాతావరణం కనిపిస్తోంది.




