Avocado Farming: అవకాడో సాగులో సీక్రెట్ ఫార్ములా.. ఇలా చేస్తే ఎకరాకు డబుల్ దిగుబడి ఖాయం!

Avocado Farming: అవకాడో సాగులో డబుల్ దిగుబడి సాధించే రహస్యాలు. తేనెటీగలు, పాలినేటర్ మొక్కలు మరియు సరైన రకాల ఎంపిక గురించి వ్యవసాయ నిపుణుల సూచనలు.

Arun Chilukuri
Published on: 17 Oct 2026 3:41 PM IST
Avocado Farming
X

Avocado Farming: అవకాడో సాగులో సీక్రెట్ ఫార్ములా.. ఇలా చేస్తే ఎకరాకు డబుల్ దిగుబడి ఖాయం!

Avocado Farming: అంతర్జాతీయ మార్కెట్‌లో అత్యంత డిమాండ్ ఉండి, సూపర్‌ఫుడ్‌గా పేరుగాంచిన అవకాడో (Avocado) సాగుపై ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రైతులు ఆసక్తి చూపుతున్నారు. అయితే అవకాడో సాగులో ఆశించిన స్థాయిలో దిగుబడులు రావాలంటే కొన్ని ప్రత్యేక మెలకువలు పాటించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. సరైన రకాలను ఎంపిక చేసుకోవడం నుంచి పాలినేషన్ (పరాగసంపర్కం) వరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే దిగుబడిని రెట్టింపు చేసుకోవచ్చు.

సాధారణ 'హాస్' (Hass) రకంతో పోలిస్తే 'పింకరెన్' రకం సాగు చేయడం వల్ల దాదాపు డబుల్ దిగుబడి సాధించవచ్చు. ఇది ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు మరియు మొక్క కాంపాక్ట్‌గా (ఎక్కువ ఎత్తు ఎదగకుండా) ఉండటం వల్ల కాయలు లోపలి భాగంలో బాగా కాస్తాయి.

టైప్-A మరియు టైప్-B రకాల ఎంపిక

అవకాడో పూలలో మగ, ఆడ భాగాలు వేర్వేరు సమయాల్లో యాక్టివ్ అవుతాయి. అందువల్ల సెల్ఫ్ పాలినేషన్ జరగడం కష్టం.

దీన్ని నివారించడానికి తోటలో టైప్-A మరియు టైప్-B రకాలను కలిపి సాగు చేయాలి. సాధారణంగా 90% ప్రధాన రకం మొక్కలు ఉంటే, మరో 10% పోలినేటర్ మొక్కలను డైమండ్ షెప్‌లో నాటాలి.

తేనెటీగల పాత్ర:

అవకాడోలో ఫలదీకరణ మెరుగ్గా జరిగి దిగుబడి విపరీతంగా పెరగాలంటే తేనెటీగలు అత్యంత ముఖ్యం.

పూత దశ నుంచి సీజన్ ముగిసే వరకు (సుమారు 4 నెలలు) ఎకరాకు కనీసం రెండు తేనెటీగల పెట్టెలను తోటలో ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల పూత రాలిపోవడం తగ్గి, కాయ కట్టే శాతం గణనీయంగా పెరుగుతుంది.

మొక్కలు పెరిగే మొదటి 4-5 సంవత్సరాల వరకు తోటలో తగిన అంతర పంటలను సాగు చేసుకుని అదనపు ఆదాయం పొందవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.