Best Crops: మే నెలలో ఈ పంటలు సాగు చేస్తే రెట్టింపు ఆదాయం..!
Best Crops: మే నెలలో సాగు చేసే మొక్కజొన్న, జొన్న, అల్లం, పసుపు వంటి పంటల ద్వారా అధిక లాభాలు పొందే మార్గాలను తెలుసుకోండి.
Best Crops
Farming : భారతదేశంలో వ్యవసాయం అంటేనే వాతావరణంతో సాగే ప్రయాణం. మే నెల వచ్చిందంటే చాలు.. రైతన్నలు ఖరీఫ్ సీజన్ కోసం నాగలి పడుతుంటారు. అయితే, సాంప్రదాయ పంటలతో పాటు కొన్ని ప్రత్యేకమైన పంటలను మే నెలలో సాగు చేయడం ద్వారా తక్కువ సమయంలోనే లక్షల లాభాలు గడించవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
60 రోజుల్లోనే చేతికొచ్చే ఆదాయం
మే నెలలో మొక్కజొన్న, జొన్న , హైబ్రిడ్ నేపియర్ గడ్డిని సాగు చేయడం ద్వారా రైతులు త్వరగా ఆదాయాన్ని పొందవచ్చు. ఈ పంటల ప్రత్యేకత ఏంటంటే..కేవలం 50 నుండి 60 రోజుల్లోనే ఇవి కోతకు వస్తాయి. పెట్టుబడి చాలా తక్కువ, కానీ డిమాండ్ మాత్రం చాలా ఎక్కువ.పశుగ్రాసంగా నేపియర్ గడ్డికి ఏడాది పొడవునా మంచి గిరాకీ ఉంటుంది.
ఆరోగ్యంతో పాటు సిరి సంపదలు
మే నెలలో నాటడానికి అత్యంత అనువైనవి అల్లం, పసుపు , చేమదుంప. ఇవి కేవలం వంట గదిలోకే కాదు, ఔషధ తయారీలోనూ కీలకం.ఈ పంటలను ఇతర పంటలతో కలిపి అంతర పంటలుగా పండించవచ్చు.వీటి వల్ల రైతులకు పొలం కలిసి రావడమే కాకుండా, రెట్టింపు ఆదాయం లభిస్తుంది.
అంతర పంటలతో రెట్టింపు లాభం
జైద్ పంటలైన కంది, సోయాబీన్, పెసర, మినుము పంటల మధ్యలో పసుపు, అల్లం వంటివి సాగు చేయవచ్చు. దీనివల్ల వేరే పొలాన్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఒకే ఖర్చుతో రెండు పంటల లాభాలను అందుకోవచ్చు.
సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
అల్లం, పసుపు, చేమదుంప సాగు చేసే రైతులు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.ఈ పంటలకు మంచి నీడ అవసరం. అలాగే పొలంలో నీరు నిల్వ ఉండకుండా సరైన డ్రైనేజీ సౌకర్యం ఉండాలి.పంటల మధ్య ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను తొలగిస్తూ ఉండాలి.ఇవి పండడానికి 8 నుండి 9 నెలల సమయం పట్టినప్పటికీ, మార్కెట్‌లో వీటికి 12 నెలల పాటు స్థిరమైన డిమాండ్ ఉంటుంది. సమయానుకూలంగా పంటలను ఎంచుకునే రైతు ఎప్పుడూ నష్టపోడు. మే నెలలో ఈ పంటలను సాగు చేయడం ద్వారా రైతులు అతి తక్కువ కాలంలోనే ఆర్థికంగా స్థిరపడవచ్చు.




