Agriculture: మే నెలలో సాగు.. రైతన్నకు లాభాలు.. తక్కువ పెట్టుబడితో కోట్లు కురిపించే పంటలు ఇవే!
Agriculture: మే నెలలో రైతులు సాగు చేయాల్సిన లాభదాయకమైన పంటల పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
Agriculture: మే నెలలో సాగు.. రైతన్నకు లాభాలు.. తక్కువ పెట్టుబడితో కోట్లు కురిపించే పంటలు ఇవే!
Best crops for May : ఖరీఫ్ సీజన్ వచ్చేస్తోంది. మే నెల ప్రారంభం నుంచే పొలాల్లో హడావిడి మొదలవుతుంది. అయితే, మూస పద్ధతిలో కాకుండా తెలివిగా పంటలను ఎంచుకుంటే.. తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను ఆర్జించవచ్చు. మే నెలలో విత్తడం ద్వారా కేవలం 60 రోజుల్లోనే చేతికి వచ్చే పంటల నుంచి, ఏడాది పొడవునా డిమాండ్ ఉండే ఔషధ పంటల లిస్ట్ చూద్దాం.
1. 60 రోజుల్లోనే కాసులు కురిపించే పంటలు
మే నెలలో మొక్కజొన్న, జొన్న, హైబ్రిడ్ నేపియర్ గడ్డి సాగు చేయడం రైతులకు ఎంతో మేలు చేస్తుంది. ఈ పంటల ప్రత్యేకత ఏంటంటే..ఇవి కేవలం 50 నుంచి 60 రోజుల్లోనే కోతకు సిద్ధమవుతాయి. పెట్టుబడి తక్కువ, కానీ మార్కెట్‌లో వీటికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. పశుగ్రాసంగా , వాణిజ్య పంటగా ఇవి రైతులకు తక్షణ ఆదాయాన్ని అందిస్తాయి.
2. ఔషధ పంటల త్రిమూర్తులు
వైద్య ఆరోగ్య రంగంలో వీటికి ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. మే నెలలో వీటిని విత్తడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
అంతర పంటలుగా సాగు: వీటిని ప్రత్యేకంగా కాకుండా, ఇతర పంటల మధ్యలో కూడా సాగు చేయవచ్చు. దీనివల్ల రైతుకు పొలం కలిసి రావడమే కాకుండా, రెట్టింపు లాభం అందుతుంది. వంటల్లోనూ, మందుల తయారీలోనూ వాడటం వల్ల ఏడాది పొడవునా వీటికి మంచి ధర లభిస్తుంది. ఈ పంటలు చేతికి రావడానికి 8 నుంచి 9 నెలలు పట్టినప్పటికీ, ఇచ్చే లాభం మాత్రం భారీగా ఉంటుంది.
3. 'జైద్' పంటలతో రెట్టింపు ఆదాయం
రైతులు తమ పొలాల్లో కంది, సోయాబీన్, పెసర, మినుము వంటి జైద్ పంటలను కూడా పండించవచ్చు. వీటికి ప్రత్యేకంగా పొలాలు వెతకాల్సిన పనిలేదు. ఇతర ప్రధాన పంటల మధ్యలో వీటిని సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.
సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
అల్లం, పసుపు వంటి పంటలకు మంచి నీడ ఉండేలా చూసుకోవాలి. అలాగే పొలంలో నీరు నిల్వ ఉండకుండా నీటి పారుదల సౌకర్యం బాగుండాలి. పంటల మధ్య పెరిగే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించడం వల్ల మొక్కలకు పోషకాలు బాగా అందుతాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి. మే నెలలో సరైన పంటలను ఎంచుకుని, క్రమశిక్షణతో సాగు చేస్తే.. సామాన్య రైతు కూడా సంపన్న రైతుగా మారడం ఖాయం.




