Farming: సమ్మర్ స్పెషల్ బిజినెస్.. 40 రోజుల్లోనే లక్షాధికారి చేసే పంట
వేసవిలో తక్కువ వ్యవధిలో పండే దోసకాయ, కొత్తిమీర సాగు గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
Farming
Vegetable Farming: సాధారణంగా సమ్మర్ వచ్చిందంటే అందరూ ఏసీల కింద సేదతీరాలని అనుకుంటారు. కానీ, తెలివైన వారు మాత్రం ఇదే సమయాన్ని కాసులు కురిపించే అవకాశంగా మార్చుకుంటారు. వేసవిలో నీటి ఎద్దడి ఉన్నా, తక్కువ నీటితో, అతి తక్కువ కాలంలో పండే పంటలకు మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా దోసకాయ, కొత్తిమీర సాగు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.
ఎందుకు ఈ పంటలే ప్రత్యేకం?
వేసవిలో మన శరీరానికి చలవనిచ్చే ఆహార పదార్థాలకు గిరాకీ పెరుగుతుంది. కూరల్లోను, సలాడ్స్‌లోను దోసకాయకు తిరుగులేదు. అలాగే, ఏ వంటకమైనా గుమగుమలాడాలంటే కొత్తిమీర ఉండాల్సిందే. అందుకే ఈ రెండు పంటలు వేసిన రైతులకు 40 రోజుల్లోనే పంట చేతికి వచ్చి, జేబులు నిండుతాయి.
సాగులో మెలకువలు
ఈ పంటలను సాగు చేయడం పెద్ద బ్రహ్మ విద్యేమీ కాదు. కొంచెం పక్కా ప్లానింగ్ ఉంటే చాలు..నీరు నిల్వ ఉండని సారవంతమైన ఇసుక నేలలు ఈ సాగుకు దివ్యౌషధం. పొలాన్ని ముందుగా బాగా చదును చేసుకుని, మురుగునీరు పోయేలా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి.రసాయనాల కంటే సహజ ఎరువులకే ప్రాధాన్యత ఇవ్వండి. ఎకరాకు 8-10 టన్నుల పశువుల ఎరువు లేదా 3 టన్నుల వర్మీ కంపోస్ట్ వేస్తే మొక్కలు ఏపుగా పెరుగుతాయి. ముఖ్యంగా 100 కిలోల వేప పిండి వాడితే నేల ద్వారా వచ్చే చీడపీడల బెడద ఉండదు. దోసకాయ పంటకు వేడి ఎండలు వరం లాంటివి. ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ దాటితే విత్తనం త్వరగా మొలకెత్తి, కాయ త్వరగా ఎదుగుతుంది.
పెట్టుబడి తక్కువ.. లాభం మెండు
వేసవిలో కొత్తిమీర ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. మరోవైపు దోసకాయల వినియోగం ఇళ్లల్లోనే కాకుండా జ్యూస్ సెంటర్లు, హోటళ్లలో విపరీతంగా ఉంటుంది. సరైన విత్తనాలను ఎంచుకుని, క్రమం తప్పకుండా నీటి తడులు ఇస్తే చాలు.. 40వ రోజు నుండి మీరు కోత మొదలు పెట్టవచ్చు.
సిటీలో ఖాళీగా ఉండే బదులు, పల్లెటూరి వెళ్ళి ఈ షార్ట్ టర్మ్ పంటలను సాగు చేస్తే.. అటు పచ్చని ప్రకృతి మధ్య కాలక్షేపంతో పాటు, ఇటు ఆర్థికంగానూ మంచి ఊతం లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? ఈ సమ్మర్‌లో మీరు కూడా రైతుగా మారి లాభాల పంట పండించండి.




