Black Rice: నల్ల బియ్యంతో (బ్లాక్ రైస్) భారీ లాభాలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు!
Black Rice: నల్ల బియ్యం (బ్లాక్ రైస్) సాగు చేయడం ద్వారా రైతులు ఎలా భారీ లాభాలు పొందవచ్చు? దీనివల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో ఈ వీడియోలో తెలుసుకోండి.
Black Rice: నల్ల బియ్యంతో (బ్లాక్ రైస్) భారీ లాభాలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు!
Black Rice: సాధారణ వరి సాగుకు భిన్నంగా నల్ల బియ్యం (బ్లాక్ రైస్) సాగు చేయడం ద్వారా రైతులు భారీ లాభాలు పొందవచ్చని ఈ వీడియోలో రైతు వివరించారు. ఈ ప్రత్యేకమైన వరి వంగడాన్ని పండించడం వల్ల లాభాలతో పాటు ఆరోగ్యపరంగా కూడా ఎంతో ప్రయోజనం ఉంటుందని నిపుణులు, రైతులు పేర్కొంటున్నారు.
సాధారణ వరి రకాలతో పోలిస్తే బ్లాక్ రైస్‌కు సిలింద్రాల ద్వారా వచ్చే అగ్గి తెగులు వంటి చీడపీడలు చాలా తక్కువగా వస్తాయని, దీనివల్ల క్రిమిసంహారక మందుల ఖర్చు తగ్గుతుందని తెలిపారు.
ఈ పంట కాలం సుమారు 140 నుంచి 150 రోజులు పడుతుంది. అస్సాంలోని గోల్పుర ప్రాంతంలో మొదట దీన్ని విస్తృతంగా సాగు చేసి మంచి ఫలితాలు సాధించారు.
నల్ల ధాన్యాన్ని ఉడికించినప్పుడు అందులోని 'యాంతోసయనిన్' (Anthocyanin) అనే యాంటీ ఆక్సిడెంట్ కారణంగా అది ఊదా రంగులోకి మారుతుంది. ఇది క్యాన్సర్ కారకాలను అడ్డుకోవడంలో, మధుమేహం (డయాబెటిస్) నియంత్రణలో, బరువు తగ్గడంలో ఎంతో సహాయపడుతుంది.
ఇందులో కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉండి కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.




