Organic Farming: కాసులు కురిపిస్తున్న వంకాయ సాగు.. సేంద్రియ పద్ధతులతో రైతు లాభాలు!

Organic Farming: నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఓ రైతు దశాబ్దాలుగా వంకాయ సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో పంటను పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Arun Chilukuri
Published on: 28 Sept 2026 12:57 PM IST
Organic Farming
X

Organic Farming: కాసులు కురిపిస్తున్న వంకాయ సాగు.. సేంద్రియ పద్ధతులతో రైతు లాభాలు!

Organic Farming: వ్యవసాయంలో చాలామంది రైతులు మూస ధోరణులను వీడి, వినూత్న పద్ధతులు పాటిస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఎప్పుడూ ఒకే పంట కాకుండా తగిన మార్పులతో వ్యవసాయం చేస్తేనే లాభాలు సాధ్యమని అధికారులు చెబుతుంటారు. అయితే నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఓ రైతు మాత్రం వంగ సాగును ప్రధానంగా ఎంచుకుని, గత 20 ఏళ్లుగా లాభాలు సాధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం పర్వతాపురం గ్రామానికి చెందిన రైతు గోపాల్‌ రెడ్డి గత రెండు దశాబ్దాలుగా విభిన్నంగా వంగ పంటను సాగు చేస్తున్నారు. అన్ని సీజన్లలోనూ డిమాండ్ ఉండే వంగ సాగును ఎంచుకున్న ఆయన, పూర్తిగా సేంద్రియ విధానాలను అవలంబిస్తూ నాణ్యమైన పంట దిగుబడిని సాధిస్తున్నారు.

ఈ ఏడాది గోపాల్‌ రెడ్డి రెండున్నర ఎకరాల్లో వంకాయతో పాటు ఇతర కూరగాయల సాగు చేపట్టారు. పెట్టుబడి పోను రూ. 4 లక్షలకు పైగా నికర ఆదాయం ఆర్జిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక మార్కెట్లతో పాటు అచ్చంపేట, కల్వకుర్తి, హైదరాబాద్ మార్కెట్లకు పంటను తరలించి మంచి గిట్టుబాటు ధర అందుకుంటున్నట్లు చెప్పారు. గోపాల్‌ రెడ్డి అనుసరిస్తున్న సేంద్రియ సాగు విధానం చుట్టుపక్కల రైతులందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.