Garlic Farming: కేవలం 6 నెలలు.. లక్షల ఆదాయం.. వెల్లుల్లి సాగుతో కాసుల వర్షం!

Garlic Farming: కేవలం ఆరు నెలల్లో, ఎకరానికి రూ. 40 వేల పెట్టుబడితో రూ. 10 లక్షల వరకు ఆదాయం ఇచ్చే వెల్లుల్లి సాగు వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Naresh.k
Published on: 1 May 2026 4:04 PM IST
Garlic Farming
X

Garlic Farming: కేవలం 6 నెలలు.. లక్షల ఆదాయం.. వెల్లుల్లి సాగుతో కాసుల వర్షం!

Garlic Farming: వ్యవసాయం అంటే కేవలం కష్టం మాత్రమే కాదు, సరైన ప్రణాళిక ఉంటే అది ఒక లాభసాటి వ్యాపారం అని నిరూపిస్తున్నారు నేటి ఆధునిక రైతులు. తక్కువ సమయంలో, తక్కువ పెట్టుబడితో కోట్లు సంపాదించే మార్గాల కోసం చూస్తున్నారా? అయితే వెల్లుల్లి సాగు మీకు బెస్ట్ ఛాయిస్.

ఏడాదంతా డిమాండ్..

వంట గదిలో వెల్లుల్లి లేనిదే ఏ కూర పూర్తి కాదు. అందుకే మార్కెట్లో దీనికి ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుంది. వెల్లుల్లిని కేవలం ఒక పంటగా కాకుండా ఒక క్యాష్ క్రాప్‌గా పరిగణిస్తారు. సరైన పద్ధతిలో సాగు చేస్తే, కేవలం ఆరు నెలల్లోనే మీ చేతిలో రూ. 10 లక్షల వరకు ఆదాయం ఉండే అవకాశం ఉంది.

సాగుకు సరైన సమయం.. పద్ధతులు

వర్షాకాలం ముగిసిన వెంటనే, అంటే అక్టోబర్, నవంబర్ నెలలు వెల్లుల్లి సాగుకు అత్యంత అనుకూలమైనవి. వెల్లుల్లి కళ్ల ద్వారా విత్తనం వేయాలి. ప్రతి మొక్కకు మధ్య కనీసం 10 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి.నీరు నిలిచిపోకుండా ఉండేలా, నీటి పారుదల సౌకర్యం ఉన్న నేలలు వెల్లుల్లికి మేలు చేస్తాయి. వెల్లుల్లి సాగులో లెక్కలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఒక ఎకరం భూమిలో సాగు చేయడానికి సుమారు రూ. 40,000 మాత్రమే ఖర్చు అవుతుంది. ఎకరానికి దాదాపు 50 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. నాణ్యతను బట్టి క్వింటాల్ ధర రూ. 10,000 నుండి రూ. 21,000 వరకు పలుకుతోంది.

ఖర్చులు పోను, ఒక ఎకరం నుంచి రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు లాభం పొందే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. మీరు ఇంకా ఎక్కువ లాభాలు పొందాలనుకుంటే రియా వన్ అనే రకాన్ని ఎంచుకోవాలి. ఈ రకంలో ఒక్కో వెల్లుల్లి గడ్డ సుమారు 100 గ్రాముల బరువు ఉంటుంది. దీనిలో 6 నుండి 13 కళ్లు ఉండి, నాణ్యతలో సాటిలేకుండా ఉంటుంది. మార్కెట్లో ఈ జాతికి డిమాండ్ చాలా ఎక్కువ, తద్వారా ధర కూడా అధికంగా లభిస్తుంది. సాంప్రదాయ పంటల కంటే ఇలాంటి వాణిజ్య పంటలపై దృష్టి పెడితే రైతులు తక్కువ కాలంలోనే ఆర్థికంగా స్థిరపడవచ్చు. ఆరు నెలల కష్టం.. పదేళ్ల ఆర్థిక భరోసా ఇవ్వడమే వెల్లుల్లి సాగు ప్రత్యేకత.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story