ఒక్కసారి నాటితే 100 ఏళ్ల లాభం.. వక్క సాగుతో అద్భుతాలు సృష్టిస్తున్న రైతులు!

Betel Nut Cultivation: అనంతపురం జిల్లా మడకశీర ప్రాంతంలో వక్క సాగుతో రైతులు ఏ విధంగా లాభాలు ఆర్జిస్తున్నారు? వక్క పంట సాగు విధానం మరియు ప్రాసెసింగ్ వివరాల పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.

Arun Chilukuri
Published on: 21 Sept 2026 12:19 PM IST
ఒక్కసారి నాటితే 100 ఏళ్ల లాభం.. వక్క సాగుతో అద్భుతాలు సృష్టిస్తున్న రైతులు!
X

Betel Nut Cultivation: అనంతపురం జిల్లాలోని మడకశీర నియోజకవర్గంలో వక్క తోటల సాగు రైతన్నలకు సిరులు కురిపిస్తోంది. ఒక్కసారి నాటితే దాదాపు 100 సంవత్సరాల పాటు ఫలాలను అందించే ఈ దీర్ఘకాలిక పంటతో ఇక్కడి రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారు.

అమరాపురం, అగలి, రోళ్ల మండలాల్లో వేడి తక్కువగా ఉండే వాతావరణం ఉండటంతో రైతులు పెద్దఎత్తున వక్క తోటలను సాగు చేస్తున్నారు. ఎకరం పొలంలో 450 నుంచి 500 వరకు మొక్కలను నాటుతారు.

ఈ పంటకు పెద్దగా రసాయన ఎరువులు, పురుగుల మందులు అవసరం లేదు. ఏడాదికి ఒకసారి సేంద్రీయ ఎరువులు వేస్తూ, డ్రిప్ ద్వారా నీటిని అందిస్తారు.

వక్క కాయలను యంత్రాల ద్వారా వలిచి, విత్తనాలను గంటన్నర పాటు వేడి నీటిలో మరిగిస్తారు. ఆ తర్వాత వారం నుంచి పది రోజులు ఎండబెట్టడం ద్వారా వక్క తయారవుతుంది.

స్థానిక మార్కెట్ సౌకర్యాలు తక్కువగా ఉండటంతో కర్ణాటకలోని చిత్రదుర్గం, హిరియూరు వంటి మార్కెట్లకు వక్కను తరలించి విక్రయిస్తున్నారు. ధరలను బట్టి ఎకరాకు లక్షల్లో ఆదాయం వస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.