hmtv Organic Mela: సేంద్రియ రైతులకు అండగా ‘hmtv ఆర్గానిక్ మేళా’.. మే 29 నుంచి హైదరాబాద్‌లో భారీ ఎగ్జిబిషన్!

hmtv Organic Mela: సేంద్రియ రైతులను ప్రోత్సహించేందుకు hmtv ఆధ్వర్యంలో 'ఆర్గానిక్ మేళా' నిర్వహించబడుతోంది.

Arun Chilukuri
Updated on: 11 May 2026 7:07 PM IST
hmtv Organic Mela
X

hmtv Organic Mela: సేంద్రియ రైతులకు అండగా ‘hmtv ఆర్గానిక్ మేళా’.. మే 29 నుంచి హైదరాబాద్‌లో భారీ ఎగ్జిబిషన్!

hmtv Organic Mela: సేంద్రియ వ్యవసాయం.. నేలతల్లికి ఉపకారం. అహర్నిశలు కష్టపడే రైతులకు బాసటగా నిలుస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు hmtv ప్రతిష్టాత్మకంగా ‘ఆర్గానిక్ మేళా - ఎగ్జిబిషన్ కమ్ సేల్’ను నిర్వహిస్తోంది. ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రదర్శనకు మరియు విక్రయాలకు ఇది ఒక అద్భుతమైన వేదికగా నిలవనుంది.

ఈ భారీ ఆర్గానిక్ మేళా మే నెల 29, 30 మరియు 31వ తేదీలలో మూడు రోజుల పాటు ఘనంగా జరగనుంది. HMDA గ్రౌండ్స్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. సమయం: ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు వినియోగదారులు సందర్శించవచ్చు.

ఆరుగాలం కష్టించి పండించే సేంద్రియ రైతులకు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరువ చేసే అవకాశం. తాజా ఆర్గానిక్ కూరగాయలు, పండ్లు, సిరిధాన్యాలు, పప్పు దినుసులు మరియు ఇతర ప్రకృతి సిద్ధమైన ఆహార పదార్థాలు ఒకే చోట లభిస్తాయి. రసాయన రహిత ఆహారంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ మేళా ప్రధాన ఉద్దేశ్యం.

స్టాళ్ల కోసం సంప్రదించండి:

ఈ ఎగ్జిబిషన్‌లో తమ ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రదర్శించాలనుకునే వారు లేదా స్టాళ్ల ఏర్పాటు కోసం మరిన్ని వివరాలు కావాల్సిన వారు ఈ క్రింది నంబర్లను సంప్రదించవచ్చు:

📞 95535 86266

📞 95050 66999

ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదించాలనుకునే వారు, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని hmtv యాజమాన్యం కోరుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story