పుస్తకాల్లో కాదు.. పొలంలోనే వ్యవసాయ పాఠాలు: కపిల్ అగ్రిఫామ్‌లో విద్యార్థుల సందడి!

Kapil's One Day Kisan: మొయినాబాద్‌లోని కపిల్ అగ్రిఫామ్‌లో నిర్వహించిన 'కపిల్స్ వన్ డే కిసాన్' ప్రత్యేక కార్యక్రమం విద్యార్థులకు వ్యవసాయంపై సరికొత్త అవగాహన కల్పించింది.

Arun Chilukuri
Published on: 30 July 2026 11:54 AM IST
పుస్తకాల్లో కాదు.. పొలంలోనే వ్యవసాయ పాఠాలు: కపిల్ అగ్రిఫామ్‌లో విద్యార్థుల సందడి!
X

పుస్తకాల్లో కాదు.. పొలంలోనే వ్యవసాయ పాఠాలు: కపిల్ అగ్రిఫామ్‌లో విద్యార్థుల సందడి!

Kapil's One Day Kisan: నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులు సాంకేతికత వెనుక పరిగెడుతూ వ్యవసాయ మూలాలను, అన్నం పెట్టే రైతు కష్టాన్ని మరచిపోతున్న తరుణంలో.. వారిని నేలతో, వ్యవసాయ సంస్కృతితో అనుసంధానించేందుకు 'కపిల్స్ అగ్రిఫామ్' శ్రీకారం చుట్టింది. మొయినాబాద్‌లోని కపిల్ అగ్రిఫామ్‌లో వినూత్నంగా నిర్వహించిన "కపిల్స్ వన్ డే కిసాన్" కార్యక్రమం విద్యార్థుల్లో సరికొత్త ఆలోచన రేకెత్తించింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో పొలంలో దిగి వ్యవసాయాన్ని అనుభవిస్తూ తెలుసుకున్నారు. పూర్వకాలంలో రైతులు ఉపయోగించిన ఎడ్లనాగళ్ళు, మోటబావులు, చేదబావులు, నీటి సంరక్షణ పద్ధతుల నుంచి మొదలుకొని.. నేటి ఆధునిక డ్రిప్ ఇరిగేషన్, స్మార్ట్ ఫార్మింగ్, అగ్రీ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ వరకు పలు అంశాలపై ప్రత్యక్ష అవగాహన పొందారు.

ఆహారం అంటే కేవలం 'స్విగ్గీ, జొమాటో'ల నుంచి ఆర్డర్ చేస్తే వచ్చేది కాదని, దాని వెనుక రైతు ఎంతో శ్రమ దాగి ఉందనే విషయాన్ని బావితరాలకు చాటిచెప్పడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. సేద్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం ప్రాముఖ్యతను వివరించేందుకు ఆస్ట్రిచ్‌లు, రంగురంగుల రామచిలుకలు వంటి జీవులను కూడా ప్రదర్శనలో భాగం చేశారు.

సంప్రదాయ వ్యవసాయ వారసత్వాన్ని కాపాడుతూనే, చదువుకున్న యువత ఆధునిక సాంకేతికతను జోడించి వ్యవసాయాన్ని ఒక గౌరవప్రదమైన కెరీర్‌గా ఎంచుకునేలా ప్రోత్సహిస్తున్న ఈ 'వన్ డే కిసాన్' కార్యక్రమాన్ని ప్రకృతి ప్రేమికులు, స్థానికులు తీవ్రంగా ప్రశంసిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story