PM Kisan Alert: ఇలా చేస్తే పీఎం కిసాన్ డబ్బులు పడవు.! ఇవి గుర్తించుకోవాల్సిందే..

PM Kisan Alert: అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం గమనికను జారీ చేసింది. పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో ఈరోజు రూ. 2 వేలు జమ కానున్నాయి.

Ravi
By Ravi
Published on: 20 Jun 2026 12:15 PM IST
PM Kisan Alert
X

PM Kisan Alert: ఇలా చేస్తే పీఎం కిసాన్ డబ్బులు పడవు.! ఇవి గుర్తించుకోవాల్సిందే..

PM Kisan Alert: దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఒక కీలక అప్‌డేట్ విడుదలైంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ పథకం కింద అందించే రూ. 2,000 నిధులు ఈరోజే నేరుగా జమ కానున్నాయి. అయితే, ఈ ఆర్థిక సాయం పొందడానికి కేంద్ర ప్రభుత్వం విధించిన ఒక నిబంధనను రైతులు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అదేంటంటే, పీఎం కిసాన్ పోర్టల్‌లో ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం. ఎవరైతే ఇప్పటివరకు తమ ఈకేవైసీని పూర్తి చేయలేదో, వారి ఖాతాల్లో ఈరోజు విడుదలయ్యే రెండు వేల రూపాయల డబ్బులు జమ కావని అధికారులు హెచ్చరించారు. నకిలీ అకౌంట్లను ఏరివేసి, కేవలం అర్హులైన నిజమైన రైతులకు మాత్రమే సబ్సిడీ అందాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తోంది.

ఒకవేళ మీరు కూడా ఇంకా ఈకేవైసీ పూర్తి చేయకపోతే ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతులు ఎక్కడికీ వెళ్లకుండా తమ స్మార్ట్‌ఫోన్ల ద్వారానే ఇంటి వద్ద కూర్చుని ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియను చాలా సులభంగా పూర్తి చేసుకోవచ్చు.

ముందుగా రైతులు కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ అయిన pmkisan.gov.inకు వెళ్లాలి. ఆ వెబ్‌సైట్ హోమ్ పేజీలో కుడివైపున ఫార్మర్స్ కార్నర్‌లో కనిపించే ‘e-KYC'అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత అక్కడ అడిగిన కాలమ్‌లో మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను తప్పులు లేకుండా నమోదు చేసి 'Search' పై క్లిక్ చేయాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీ ఆధార్‌తో లింక్ అయి ఉన్న రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది. ఆ ఓటీపీని వెబ్‌సైట్‌లో ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కగానే మీ ఈకేవైసీ ప్రక్రియ విజయవంతంగా పూర్తవుతుంది.

స్మార్ట్‌ఫోన్లు వాడటం రాని వారు లేదా ఆన్‌లైన్ ప్రక్రియపై సరైన అవగాహన లేని రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అందుబాటులో ఉంచింది. అలాంటి రైతులు తమ సమీపంలో ఉన్న మీసేవా కేంద్రాలకు లేదా కామన్ సర్వీస్ సెంటర్లకు (CSC) నేరుగా వెళ్లి బయోమెట్రిక్ విధానం ద్వారా కూడా ఈ పీఎం కిసాన్ ఈకేవైసీని చాలా సులభంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి పీఎం కిసాన్ సబ్సిడీ డబ్బులు నిరంతరాయంగా పొందాలనుకునే రైతులంతా ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా వీలైనంత త్వరగా ఈకేవైసీ అప్‌డేట్ పూర్తి చేసుకోవాలని సంబంధిత అధికారులు కోరుతున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story