PMFBY: అన్నదాతలకు బిగ్ అలర్ట్.. ఇక నాలుగు రోజులే ఛాన్స్
PMFBY: ఖరీఫ్ వరి , ఇతర పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నమోదుకు చివరి గడువు ఈ నెల 15.
PMFBY: అన్నదాతలకు బిగ్ అలర్ట్.. ఇక నాలుగు రోజులే ఛాన్స్
Kharif: వానకాలం పంటలు చేతికి వచ్చే వరకు ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. కుండపోత వర్షాలు, వరదలు, లేదా తీవ్ర అనావృష్టి... ప్రకృతి కన్నెర్ర చేస్తే రైతన్న శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే.
అందుకే, సాగులో ఎదురయ్యే ఊహించని నష్టాల నుంచి రక్షణ పొందేందుకు 'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన' ఒక దివ్యౌషధంగా నిలుస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వరి సహా వివిధ పంటలు వేసిన రైతులందరికీ వ్యవసాయ శాఖ అధికారులు ఒక కీలకమైన హెచ్చరిక జారీ చేశారు. పంట బీమా నమోదుకు చివరి గడువు వేగంగా సమీపిస్తోంది.
చివరి తేదీ ఈ నెల 15. అంటే ఇక మిగిలింది కేవలం 4 రోజులు మాత్రమే. ఖరీఫ్ సీజన్‌లోని వరి , ఇతర నోటిఫై చేసిన పంటలు. పంట సాగుకు సంబంధించిన సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాలను సమర్పించి, నిర్ణీత ప్రీమియం చెల్లించాలి. గ్రామ,మండల స్థాయిలో నమోదు చేసుకునే సమయానికి e-KYC తప్పనిసరి కాదు. ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక కూడా e-KYC వివరాలను సమర్పించవచ్చు.
ఆఖరి తేదీ దాటితే రూపాయి పరిహారం పొందడానికి కూడా అవకాశం ఉండదు. సాంకేతిక కారణాలు, ఆఖరి నిమిషం హడావుడి వల్ల నమోదు ఆగకుండా ముందే అప్రమత్తమవ్వడం శ్రేయస్కరం. రూపాయి ప్రీమియంతో వేల రూపాయల భద్రతనిచ్చే ఈ అవకాశాన్ని వదులుకోకండి.
ఆలస్యం అమృతం విషం... వెంటనే మీ సమీప రైతు సేవా కేంద్రం లేదా వ్యవసాయ అధికారులను కలిసి మీ పంటకు బీమా రక్షణ కల్పించుకోండి.




