Quail Birds Farming: కౌంజు పిట్టల పెంపకంతో కాసుల వర్షం.. ఆదిలాబాద్ రైతు సక్సెస్ స్టోరీ!

Quail Birds Farming: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన విశ్రాంత ఉద్యోగి పండరీనాథ్ యాదవ్ కౌంజు పిట్టల (కౌజు పక్షుల) పెంపకంలో సాధించిన విజయం, ఆదాయం మరియు నిర్వహణ వివరాల ప్రత్యేక కథనం.

Arun Chilukuri
Published on: 6 Aug 2026 12:01 PM IST
Quail Birds Farming
X

Quail Birds Farming: కౌంజు పిట్టల పెంపకంతో కాసుల వర్షం.. ఆదిలాబాద్ రైతు సక్సెస్ స్టోరీ!

Quail Birds Farming: తక్కువ పెట్టుబడి, అతి తక్కువ సమయం.. లాభాలు మాత్రం పుష్కలం! నాటుకోడి కంటే ఎక్కువ డిమాండ్ ఉన్న కౌంజు పిట్టల పెంపకాన్ని చేపట్టి భారీగా లాభాలు గడిస్తున్నాడు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన విశ్రాంత ఉద్యోగి మేకల పండరీనాథ్ యాదవ్. కౌంజు పక్షుల పెంపకంలో ఆయన సాధించిన విజయంపై ప్రత్యేక కథనం.

పండరీనాథ్ యాదవ్ మొదటి విడతగా తనకున్న షెడ్‌లోనే 2,000 కౌంజు పిట్టలతో పెంపకం ప్రారంభించాడు. ఒక్కో పిల్ల పక్షిని రూ. 10 చొప్పున బయట నుంచి కొనుగోలు చేసి తెచ్చాడు. వీటికి ప్రత్యేకంగా ఖరీదైన దానా కాకుండా సాధారణ మక్కపిండి మరియు మార్కెట్లో దొరికే సాధారణ ఫీడ్‌ను ఆహారంగా అందిస్తున్నాడు.

కౌంజు పక్షులు తక్కువ ఆహారాన్ని తీసుకుని వేగంగా పెరుగుతాయి. చిన్నప్పుడు వ్యాధులు రాకుండా 6 రకాల వ్యాక్సిన్లను వేస్తే సరిపోతుంది. కేవలం 50 రోజుల్లోనే ఇవి 500 గ్రాముల నుంచి 600 గ్రాముల బరువుకు చేరుకుని కోత దశకు వస్తాయి. ఒక్కో పక్షిని రూ. 50 నుంచి రూ. 60 కి హోటళ్లు మరియు వ్యాపారులకు విక్రయిస్తుంటారు.

సాధారణ బ్రాయిలర్ కోళ్ల పెంపకం కంటే కౌంజు పక్షుల పెంపకం ద్వారా 4 నుంచి 5 రెట్లు అధిక ఆదాయం వస్తుందని పండరీనాథ్ తెలిపారు. ఖర్చులన్నీ పోను ప్రతి 2 నుంచి 3 నెలల వ్యవధిలో రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఆదాయం పొందవచ్చని వెల్లడించారు.

అంతేకాకుండా, 4 నెలలు దాటిన తర్వాత ఇవి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. ఆ గుడ్లను హ్యాచరీస్‌లో ఉంచి పక్షి పిల్లలను ఉత్పత్తి చేస్తూ ఇతర రైతులకు, వ్యాపారులకు విక్రయిస్తూ అదనపు రాబడి పొందుతున్నారు. కౌంజు మాంసంలో పోషకాలు ఎక్కువగా ఉండటం, ఆరోగ్యానికి మేలు చేయడంతో హోటళ్లు, రెస్టారెంట్లలో వీటికి విపరీతమైన డిమాండ్ నెలకొంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story