Punganur Cow: కేవలం 3 అడుగుల ఎత్తు.. ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే.. రికార్డు ధరకు పుంగనూరు ఆవు!

Punganur Cow: అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరంలో అరుదైన పుంగనూరు ఆవు, దూడ రూ.5.30 లక్షలకు విక్రయమయ్యాయి.

Arun Chilukuri
Published on: 10 Nov 2026 12:16 PM IST
Punganur Cow
X

Punganur Cow: కేవలం 3 అడుగుల ఎత్తు.. ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే.. రికార్డు ధరకు పుంగనూరు ఆవు!

Punganur Cow: అరుదైన పొట్టి జాతి గోవుగా ప్రాచుర్యం పొందిన ‘పుంగనూరు’ ఆవు గోదావరి జిల్లాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన అడబాల ప్రేమ్‌కుమార్ వద్ద ఉన్న పుంగనూరు ఆవు, దాని దూడను కలిపి ఏకంగా రూ.5.30 లక్షలకు విక్రయించారు.

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల చరిత్రలోనే ఒక పుంగనూరు గోవు ఈ స్థాయిలో భారీ ధరకు విక్రయం కావడం ఇదే తొలిసారని, ఇదొక ఆల్ టైమ్ రికార్డని యజమాని ప్రేమ్‌కుమార్ తెలిపారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ ‘బీవీడీ లిమిటెడ్’ సంస్థ అధినేత ప్రసాద్ ఈ ఆవు, దూడను కొనుగోలు చేశారు.

కేవలం 36 అంగుళాల (3 అడుగులు) ఎత్తు మాత్రమే ఉన్న ఈ అరుదైన పుంగనూరు ఆవు రోజుకు రెండు పూటలా కలిపి మొత్తం 3 లీటర్ల చొప్పున పాలు ఇస్తుంది. స్వచ్ఛమైన నాటు జాతి, అరుదైన శారీరక కొలతలు కలిగిన పుంగనూరు గోవులకు మార్కెట్‌లో తీవ్ర డిమాండ్ ఉండటంతో ఈ స్థాయిలో ధర లభించినట్లు రైతు వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.