365 రోజులు పండించే పంట.. రైతులకు భారీ లాభాలు!

Sesame Seeds Cultivation: రైతులు మంచి లాభాలు సాధించేందుకు నువ్వుల సాగు చేసే విధానం, అనువైన రకాలు మరియు మెలకువల గురించి పూర్తి వివరాలు.

Arun Chilukuri
Published on: 2 Sept 2026 1:22 PM IST
365 రోజులు పండించే పంట.. రైతులకు భారీ లాభాలు!
X

365 రోజులు పండించే పంట.. రైతులకు భారీ లాభాలు!

Sesame Seeds Cultivation: రైతులకు మంచి లాభాలను అందించే నువ్వుల సాగు విధానంపై ప్రత్యేక కథనం. తెలంగాణలో నువ్వుల పంటను కరీఫ్, రబీ మరియు వేసవి కాలాల్లోనూ సాగు చేయడానికి అనుకూలమైన వాతావరణం ఉందని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. తేలికపాటి ఇసుక నేలలు ఈ సాగుకు మరింత శ్రేష్టమని చెబుతున్నారు.

కరీఫ్‌లో వర్షాధారంగా, రబీలో లేదా వేసవిలో ఆరుతడి పంటగా, అలాగే వరి మాగాణులలో రెండో పంటగా నువ్వులను పండించవచ్చు.

ఎకరాకు 2 నుంచి 2.5 కిలోల విత్తనం సరిపోతుందని, విత్తన శుద్ధి చేయడం ద్వారా తెగుళ్లను నివారించవచ్చని తెలిపారు. సాళ్ల మధ్య సరైన దూరం పాటించి విత్తుకోవాలి.

తెలుగు రాష్ట్రాలకు అనువైన రకాలు గౌరీ, మాధవి, ఎలమంచిలి-11, ఎలమంచిలి-17, రాజేశ్వరి, చందన, హిమ, శ్వేత రకాలు తెలంగాణ ప్రాంతానికి ఎంతో అనుకూలమైనవి.

మొక్కలు పసుపు రంగులోకి మారి ఆకులు రాలడం ప్రారంభమైనప్పుడు, 75% కాయలు పక్వానికి రాగానే పంటను కోయాలని సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story