Nellore: 2 అడుగుల చెట్టుకు 200 నారింజ కాయలు!

Nellore: నెల్లూరులోని నర్సరీలో థైలాండ్ బోన్సాయ్ ఆరెంజ్ చెట్టు సందడి చేస్తోంది.

Arun Chilukuri
Published on: 12 Aug 2026 11:03 AM IST
Nellore
X

Nellore: 2 అడుగుల చెట్టుకు 200 నారింజ కాయలు!

Nellore: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఒక అరుదైన నారింజ చెట్టు స్థానికులను, పకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కేవలం 2 నుంచి 3 అడుగుల ఎత్తు ఉన్న బోన్సాయ్ చెట్టుకు దాదాపు 50 నుండి 200 వరకు నారింజ కాయలు కాస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

నెల్లూరులోని కేవిఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న 'బృందావన్ గార్డెన్స్ అండ్ నర్సరీస్' నిర్వాహకుడు చైతన్య, ఈ 'థైలాండ్ వెరైటీ' బోన్సాయ్ ఆరెంజ్ మొక్కలను ప్రత్యేకంగా విదేశాల నుండి తెప్పించారు. సాధారణంగా పెద్ద చెట్లకు మాత్రమే ఆ స్థాయిలో కాయలు కాస్తాయి, కానీ ఈ అరుదైన బోన్సాయ్ రకానికి ప్రతి ఆరు నెలలకొకసారి (ఏడాదికి రెండు సార్లు) విపరీతమైన కాపు వస్తుందని నర్సరీ నిర్వాహకులు తెలిపారు.

ఈ మొక్కల ప్రత్యేకతలు:

చిన్న కుండీలు లేదా కంటైనర్లలో పెంచే ఈ చెట్టు 1.5 అడుగుల నుండి గరిష్టంగా 6 అడుగుల వరకు మాత్రమే పెరుగుతుంది. కొమ్మ కొమ్మకూ కాయలతో నిండిపోతుంది.

కాయలు ఎంతో తీయగా ఉంటాయి. పూత, పిందే దశ నుంచి కాయ మాగడానికి దాదాపు 4 నెలల సమయం పడుతుంది. అంతవరకు ఈ కాయలు చెట్టుకే ఉండి ఆర్టిఫిషియల్ చెట్టులా చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి.

విదేశీ వెరైటీ కావడంతో మార్కెట్‌లో ఈ బోన్సాయ్ ఆరెంజ్ చెట్ల ప్రారంభ ధర రూ. 7,500 నుండి రూ. 16,000 వరకు పలుకుతోంది.

ఈ వింత బోన్సాయ్ చెట్టును చూడటానికి నర్సరీకి భారీ సంఖ్యలో కస్టమర్లు తరలివస్తున్నారు. కాయలతో నిండి ఉన్న ఈ చెట్టుతో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story